
బొల్లాపల్లి: రానున్న రోజుల్లో అధికార టీడీపీకి భంగపాటు తప్పదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. ప్రజా సంకల్పయాత్రకు సంఘీభావంగా నియోజకవర్గంలో చేపట్టిన పాదయాత్ర 6వ రోజు బొల్లాపల్లి మండలం పమిడిపాడు గ్రామం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన 20 కుటుంబాలు వారు టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బొల్లా వారికి పార్టీ కండువాలు కప్పి, సాదరంగా స్వాగతం పలికారు. వైఎస్సార్ సీపీలో ప్రతి ఒక్కరికి సమన్యాయం జరుగుతుందని చెప్పారు. కష్టపడి పనిచేసే వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. పార్టీలో చేరిన వారిలో మీసాల జయరావు, బండ్ల సురేష్, మీసాల సాగర్ బాబు, శ్రీ పతి రత్నం, మీసాల సలోమాన్, కొత్తపల్లి దేవదానం, మీసాల పవన్, యోహాన్, ఇస్మాయిల్ మరో 10 కుటుంబాలు ఉన్నాయి. అనంతరం పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ.. టీడీపీలో కష్టపడి పనిచేసే వారికి సరైన ఆదరణ లేదన్నారు. వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment