గిరిజన హక్కుల్ని కాలరాస్తున్న ప్రభుత్వం
► గిరిజన సంఘాల ఐక్య కూటమి నేతలు
► అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
పూర్ణానందంపేట(విజయవాడ) : గిరిజన సంఘాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని గిరిజన సంఘాల ఐక్యకూటమి చైర్మన్ వివేక్‌వినాయక్ డిమాండ్ చేశారు. గిరిజన సంఘాల జేఏసీ రాష్ట్ర సమావేశం ఆదివారం పూర్ణానందంపేటలోని ఓ హోటల్లో ని ర్వహించారు. రాష్ట్ర విభజన తర్వాత రాజ్యాంగబద్ధంగా గిరిజనులకు సం క్రమించాల్సిన హక్కులను ప్రభుత్వం అడ్డుకుంటోందని మండిపడ్డారు.
గిరిజనులకు ప్రభుత్వం చేసిందేమీ లేదు : ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకూ గిరిజనులకు చేసిందేమీ లేదన్నారు. ఎస్టీల రిజర్వేషన్‌లశాతం, ఎస్టీ చైర్మన్‌పై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలేదని విమర్శించారు. గిరిజనుల పట్ల రాష్ట్రప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలను నడుపుతూ గిరిజనులకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.
గిరిజన హక్కులు కాలరాస్తున్న సీఎం చంద్రబాబు
ఉపన్యాసాలకు మాత్రమే పరిమితమైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గిరిజనుల హక్కులు కాలరాస్తున్నరని ఆవేదన వ్యక్తంచేశారు. టీడీపీలో ఎస్టీ ఎమ్మెల్యే ఉన్నా గిరిజన సంక్షేమశాఖకు దళిత వర్గానికి చెందిన రావేళ్ల కిషోర్‌బాబును నియమించడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది గిరిజనులు ఉన్నత స్థానాల్లో ఉన్నా వారేవరికి నామినేటేడ్ పదవుల్లో స్థానం కల్పించకపోవడానికి గిరిజనుల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న వివక్షతే కారణమన్నారు. గిరిజనులపట్ల టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఆపకపోతే ప్రభుత్వంపై పోరాడతామన్నారు.
అదే తరహాలో పోరాడతాం : ఏజేన్సీ ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలను గిరిజనులు ఏ రకంగా అడ్డుకున్నారో అదే తరహాలో తమ హక్కులకోసం పోరాడతామన్నారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవమైన అగస్టు 9న గిరిజనులతో కలసి రాష్ట్రంలో భారీసభ నిర్వహిస్తున్నట్లు వివరించారు. గిరిజన సంఘాల ఐక్యకూటమి వైస్‌చైర్మన్ రామస్వామి, స్టేద్వా జల్లా అధ్యక్షుడు పుల్లయ్య, ఎస్టీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీన్‌కుమార్, పి.శ్రీనివాసరావు, మిత్ర, కళ్యాణి, గొపాలరావు, సత్యనారాయణలతోపాటు 13 జిల్లాల నుంచి వచ్చిన నాయకులు పాల్గొన్నారు.