ఆస్ట్రేలియా పీక్స్‌పై భారత్ జెండాను ఎగురవేస్తున్న కారే సత్యారావు
ఎస్.రాయవరం (పాయకరావుపేట): బంగారమ్మపాలెం గ్రామానికి చెందిన యువకుడు కారే సత్యారావు ఆస్ట్రేలియా దేశంలో ప్రతిభ చాటాడు. 10 పీక్స్ (పర్వతాలు) అధిరోహించి సత్తా చాటాడు. ఇప్పటికే దేశ విదేశాల్లో సాహసాలు చేసి భారత్‌లో ఎత్తయిన పర్వతం ఎవరెస్టు, సౌతాఫ్రికాలో కిలిమంజారో పర్వతాలను ఎక్కి భారత దేశ ప్రతిభను చాటాడు.
తాజాగా ఆస్ట్రేలియా దేశం వెళ్లి 10 పీక్స్, కోసియాజోకో, టౌన్‌సెండ్, టౌయినేమ్, రామ్స్‌హెడ్, ఎధిరిడ్జి రైడ్, రామ్స్‌హెడ్ నార్త్, అలీస్‌రౌసన్, బైట్స్ కమ్ సౌత్, అబ్బోట్ పీక్, కర్త్రర్ పీక్స్ అనే పర్వతాలను అధిరోహించి భారత్ జెండాను ఎగురవేశాడు. ప్రస్తుతం ఈ సాహసాల సత్యారావు ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు. తాను సాధించిన ఘనతను ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చేరవేశాడు. దీంతో కుటుంబ సభ్యులు, బంగారమ్మపాలెం గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment