
ఓటర్ల వివరాలు సేకరిస్తున్న సందీప్‌ను నిలదీస్తున్న చిక్కాల రామారావు తదితరులు
నక్కపల్లి(పాయకరావుపేట): పాయకరావుపేట మండలం పీఎల్‌పురం గ్రామంలో సర్వే పేరుతో వైఎస్సార్‌సీపీ అభిమానుల నుంచి వివరాలు సేకరించి ఓట్లు తొలగించేందుకు కుట్ర పన్నుతున్న ముగ్గురి ముఠాను స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన సందీప్ అనే యువకుడు పాయకరావుపేటకు చెందిన వరదా శ్రీను, వరదా సాంబ అనే వ్యక్తులతో కలసి పీఎల్‌పురంలో సర్వే చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అభిమానుల ఇంటికి వెళ్లి మీ పేరేంటి, మీరు ఏ పార్టీకి చెందిన వారు, ఏ పత్రికలు చదువుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు, మీ ఓటరు ఐడి నంబరు ఎంత..? అంటూ ఆరా తీసి వారి వద్ద నున్న ట్యాబ్‌లో నమోదు చేస్తున్నారు. దీంతో ఆనుమానం కలిగి న స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు రామకృష్ణ, దివాణం వారిని పంచాయ తీ వద్ద నిలదీసి మండల స్థాయి నా యకులకు సమాచారం ఇచ్చారు.
వారు గ్రామానికి వచ్చి చేరుకుని సర్వే చేస్తున్న ముగ్గురిని ఎక్కడ నుంచి వచ్చారు.. దేని కోసం సర్వే చేస్తున్నారు, మిమ్మల్ని ఎవరు పంపించారు, ఓట ర్ల వివరాలు ఎందుకు సేకరించాల్సి వచ్చిందని నిలదీశారు. తాము ఎన్‌టీవీ, ఎన్‌డీటీవీల నుంచి వచ్చామని ఏ పార్టీకి ఓటేస్తారనే దానిపై సర్వే చేస్తున్నామని వారు చెప్పారు. వారి వద్ద ఎటువంటి ఐడెంటిటీ కార్డులు లేకపోగా, ఫొటో లేకుండా ఉన్న రిపబ్లిక్ పాలసీ రీసెర్చ్ గ్రూపుకు చెందిన కార్డు ఒకటి చూపించారు. డబ్బులు ఇస్తామంటే ఇతని వెంట వచ్చామని మాకేమీ తెలియదంటూ వారిలో వరదా శ్రీను, వరదా సాంబ తెలిపారు. దీంతో అనుమానం కలిగిన చిక్కాల రామారావు తదితరులు వారు ముగ్గురిని స్థానిక పోలీసుస్టేషన్‌లో అప్పగించారు. ఫిర్యాదు అందించారు. అనంతరం రామారావు, పట్టణ శాఖ అధ్యక్షుడు దగ్గుపల్లి సాయి తదితరులు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అభిమానుల ఓట్లు తొలగించడం కోసమే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇటువంటి వ్యక్తులను పంపించి సర్వేలు చేయిస్తున్నారని ఆరోపించారు. పట్టుబడ్డ వారిపై కేసు నమోదు చేసి వారి వద్ద ఉన్న ట్యాబ్‌లో సమాచారాన్ని సీజ్ చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment