శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు | vvips visits tumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

Published Sat, Feb 4 2017 11:17 AM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM

శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు - Sakshi

శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

తిరుమల:
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఏపీ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు.

అనంతరం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే నారాయణ స్వామి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ ఆర్‌ నాయక్‌, చెన‍్నయ్‌ ఇన్‌కంటాక్స్‌ డైరెక‍్టర్‌ జనరల్‌ మురళీ కుమార్‌, శ్రీకాళహస్తికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత బియ‍్యపు మధుసూదనరెడ్డి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం ప్రముఖులకు  రంగనాయకుల మండపం వద్ద వేదాశీర్వచనం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement