హామీలతో దగా | WARRANTIES dishonesty | Sakshi
Sakshi News home page

హామీలతో దగా

Published Thu, Jun 9 2016 1:21 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

WARRANTIES dishonesty

హామీలిచ్చి మోసం చేశారంటూ చంద్రబాబుపై వైఎస్‌ఆర్‌సీపీ ఫిర్యాదులు
పోలీస్ స్టేషన్ల వరకు నిరసన ర్యాలీలు
టీడీపీ మేనిఫెస్టోలో వేయి అబద్ధాలు : పెద్దిరెడ్డి ధ్వజం
తెలుగు ప్రజలకు వెన్నుపోటు - భూమన మండిపాటు
ఆయన మిస్టర్ 420  - ఆర్‌కే రోజా ఫైర్

 

నోటికొచ్చిన హామీలతో ప్రజలను మభ్యపెట్టారంటూ చంద్రబాబు నాయుడుపై జిల్లా ప్రజలు, వైఎస్‌ఆర్ సీపీ నాయకులు కన్నెర్ర చేశారు. రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు, చేనేతలు, ఉద్యోగులు, కాపులు, ముస్లింలు.. ఇలా అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని వారంతా విమర్శించారు. నోటికొచ్చిన హామీలిచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధిష్టానం పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు పోలీస్ స్టేషన్లలో బుధవారం ఫిర్యాదు చేశారు. 420 కేసులు నమోదు చేయాలని కోరారు.

 

చిత్తూరు: అధికారం చేజిక్కించుకోవాలని అడ్డగోలు హా మీలిచ్చి టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రజల ను మోసం చేశారంటూ బుధవారం జిల్లావ్యాప్తంగా 21 పోలీస్‌స్టేషన్లలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ఫిర్యా దు చేశారు. అంతకు ముందు పోలీస్ స్టేషన్ల వరకు ని రసన ర్యాలీలు చేపట్టారు. అధికారంలోకి వచ్చిన రెం డే ళ్లు అవుతున్నా హామీలను అమలుచేయకపోవడంపై 420 కేసులో నమోదు చేయాలని డిమాండ్ చేశారు.


మేనిఫెస్టోలో వెయ్యి అబద్ధాలు
అధికారం చేజిక్కించుకున్న తర్వాత ప్రజా సంక్షేమం మరచి తన కొడుకు సంక్షేమం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. పుంగనూరు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ టీడీపీ మేనిఫెస్టోలో వంద పేజీల వెయ్యి అబద్ధాలున్నాయని ధ్వజమెత్తారు. లక్షల కోట్ల అవినీతికి పాల్పడి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం నీతిమాలిన చర్య అని విమర్శించారు.

 
ఐదు కోట్ల మందికి వెన్నుపోటు

ఐదు కోట్ల మంది తెలుగు ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  రైతురుణ మాఫీ, డ్వాక్రా రుణమాఫీ, వ్యవసాయానికి 9 గంటల విద్యుత్, నిరుద్యోగభృతి, విద్యార్థులకు ల్యాప్‌టాప్స్, మహాలక్ష్మి వంటి హామీల్లో ఏ ఒక్కటీ అమలుచేసిన పాపానపోలేదని ధ్వజమెత్తారు.


ఆయన మిస్టర్ 420
ఇష్టానుసారం హామీలు ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు మిస్టర్ 420 అని నగరి ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. నగరి పోలీస్‌స్టేషన్‌లో చంద్రబాబుపై ఫిర్యాదు చేసిన ఆమె మాట్లాడుతూ టీడీపీ 600 హామీలు ఇచ్చిందని.. 700 రోజులు కావొస్తున్నా ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు చీటర్ అని అన్నారు. రైతుల ఉసురు ఆయనకు తగులుతుందన్నారు.

 

    
పీలేరులో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సీఐ నాగరాజుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను చంద్రబాబు నట్టేట ముంచారని విమర్శించారు. అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని మదనపల్లి ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి విమర్శించారు.  టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసిన అనంతరం ఆయన మాట్లాడారు. అధికారం కోసం వంచనకు పాల్పడ్డ టీడీపీ అధినేతకు జనం బుద్ధిచెబుతారన్నారు.

     
చంద్రబాబు ప్రభుత్వం అవినీతిలో మునిగిపోయిందని పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ విమర్శించారు. ఆయన స్థానిక పోలీస్‌స్టేషన్‌లో చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నిలుపుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. చిత్తూరులో నియోజకవర్గ సమన్వయకర్త జంగాలపల్లి శ్రీనివాసులు ఆధ్వర్యంలో వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదేవిధంగా పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గా యత్రీ దేవి ఆధ్వర్యంలో మహిళా పోలీసుస్టేషన్ లో ఫిర్యాదుచేశారు.  సత్యవేడులో నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం  పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


గుమ్మడి బాలకృష్ణయ్య, అంజూరు శ్రీనివాసులు, మిద్దెల హరి ఆధ్వర్యంలో 200 మంది పార్టీ కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించి పోలీస్‌స్టేషన్‌లో చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు.  రేణిగుంటలో మండల కన్వీనర్ హరిప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు.  గంగాధరనెల్లూరులో వైఎస్సార్‌సీపీ ఎంపీపీ ప్రగతి కరుణ, జెడ్పీటీసీ సభ్యుడు తూంగుండ్రం గుణశేఖర్ మొదలి, అధికార ప్రతినిధి వేల్కూరు బాబు ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు.   తంబళ్లపల్లెలో వైఎస్సార్‌సీపీ రైతువిభాగం జిల్లా కార్యవర్గసభ్యులు పొన్నిరెడ్డి,  సర్పంచ్ గీత ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు.

     
కుప్పంలో పార్టీ మండల కన్వీనర్ వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో చంద్రబాబుపై 420 కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదుచేశారు. పలమనేరులో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ బాలాజీనాయుడు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అనంతరం పోలీస్‌స్టేషన్‌లో  ఫిర్యాదు చేశారు. బెరైడ్డిపల్లె మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ రెడ్డెమ్మ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మొగశాల కృష్ణమూర్తి,  వైస్ ఎంపీపీ రెడ్డెప్పల ఆధ్వర్యంలో  ఫిర్యాదు చేశారు. చంద్రగిరి నియోజకవర్గం పాకాలలో మండల కన్వీనర్ నంగాబాబు ఆధ్వర్యంలో స్థానిక నాయకులు పోలీస్ స్టేషన్‌లో చంద్రబాబుపై ఫిర్యాదుచేశారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement