నీరు వృథా..రైతు వ్యధ | Waste water .. farmer distraught | Sakshi
Sakshi News home page

నీరు వృథా..రైతు వ్యధ

Published Tue, Jan 21 2014 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 2:49 AM

నీరు వృథా..రైతు వ్యధ

నీరు వృథా..రైతు వ్యధ

  • రిజర్వాయర్లు నిరుపయోగం
  •  పూడిక తో ఇబ్బందులు
  •  పాడైన గేట్లతో ఇక్కట్లు
  •  1600 ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకం
  •  పట్టించుకోని అధికారులు
  •  
    మాకవరపాలెం, న్యూస్‌లైన్ : నీటి కోసం అన్నదాత అష్టకష్టాలు పడే రోజులివి.. అనావృష్టి కారణంగా పచ్చని పొలాలు బీడువారి పోతూ ఉంటే కన్నీళ్లతో చూస్తూ కుమిలిపోవడం తప్ప మరేం చేయలేని కాలమిది.. ఇటువంటి పరిస్థితుల్లో విలువైన జీవజలం వృథాగా పోతూ ఉంటే వ్యవసాయదారుకు ఎంత వేదనగా ఉంటుం ది? మాకవరపాలెం మండలంలోని మామిడిపాలెం, పాపయ్యపాలెం రిజర్వాయర్‌ల దిగువన గల రైతన్నలకు ఈ పరిస్థితి అనుభవమవుతోంది. అటు పేరుకుపోతున్న పూడిక వల్ల, ఇటు పాడైన రిజర్వాయర్ గేట్ల వల్ల నీరు పొలాలకు చెందకుండా పోతోంది.
     
    పూడికతో సతమతం : మండలంలోని తూటిపాల పంచాయతీ శివారు మామిడిపాలెం గ్రామ సమీపంలో 1975లో రిజర్వాయర్‌ను నిర్మించారు. తూటిపాల, మామిడిపాలెం, పాతలూరు, అడిగర్లపాలెం, రామారాయుడుపాలెం గ్రామాలకు చెందిన 600  ఎకరాలకు నీరందించేందుకు లక్ష్యంగా నిర్ణయించారు. నిర్మించిన ఐదు సంవత్సరాలపాటు రిజర్వాయర్ నుంచి సక్రమంగా నీరు అందింది. అనంతరం ఇసుక రిజర్వాయర్ గర్భంలో చేరింది.
     
    ఇదీ పరిస్థితి


    రిజర్వాయర్ గర్భం సుమారు 12 అడుగలమేర పూడిక పేరుకుపోయింది. భారీ వర్షాలు కురిసినా చుక్కనీరు కూడా రిజర్వాయర్ నిల్వ ఉండడం లేదు. పిచ్చిమొక్కలు పెరిగాయి.
     
    రిజర్వాయర్ పక్కనే ఉన్న రాతికట్టు కూడా గతంలో కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. పదేళ్లుగా ఈ రిజర్వాయర్  వృథాగా పడి ఉండడంతో  రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
     
    2009లో మదుముల మరమ్మతులకు రూ.10 లక్షలు వెచ్చించినా ప్రయోజనం లేదు.
     
     ఇదీ దుస్థితి


    లైనింగ్ పనులు పూర్తి చేసినా నీటిని విడుదల చేసే గేట్లు శిథిలమై రిజర్వాయర్‌లో ఉన్న నీరు నిత్యం వృథా అవుతోంది.
     
    కొంతైనా నీటిని పొలాలకు మళ్లించుకునేందుకు రైతులు గేటువద్ద ఇసుక మూటలు వేసుకుంటున్నారు.
     
    ఈ రిజర్వాయర్ల ద్వారా పూర్తి స్తాయిలో సాగునీరు అందేలా చూడాలని గత కొన్నేళ్లుగా అధికారులు, ప్రజా ప్రతినిదులకు రైతులు చేస్తున్న విన్నపాలు నీటిమూటలుగానే మిగిలాయి.
     
     మరమ్మతులకు నోచని గేట్లు

    మండలంలోని పాపయ్యపాలెం గ్రామ సమీపంలో 1998లో జిజిగెడ్డ ఆధారంగా రిజర్వాయర్‌ను నిర్మించారు.  ఈ రిజర్వాయర్ నుంచి బూరుగుపాలెం, పాపయ్యపాలెం, బుచ్చన్నపాలెం, ముసిడిపాలెం, వెంకటాపురం, రామారాయుడుపాలెం ప్రాంతాల్లోని 1000 ఎకరాలకు సాగునీరు అందేది.  కొన్ని సంవత్సరాలు సాగునీరు బాగానే అందినా క్రమేపీ కాలువలు పూడుకుపోయి భూములకు నీరు సక్రమంగా అందేదికాదు.
     
    ఈ పరిస్థితుల్లో రైతుల అభ్యర్ధన మేరకు అప్పటి మంత్రి కొణతాల రామకృష్ణ చొరవతో 2009లో నాటి సీఎం రాజశేఖరరెడ్డి కాలువ లైనింగ్‌కు రూ. 38 లక్షలు నిధులు విడుదల చేశారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement