మల్కాపురం(విశాఖ): హిందుస్థాన్ షిప్‌యార్డ్ నిర్మించిన యుద్ధనౌక(వీసీ11184) సోమవారం జలప్రవేశం చేసింది. భారత రక్షణ శాఖ కోసం నిర్మించిన ఈ నౌకను సముద్ర అంతర్భాగంలో పరిశోధనల నిమిత్తం వినియోగించనున్నారు. శత్రువుల సమాచారం అతి సులువుగా తెలుసుకొనే విధంగా ఈ నౌకను రూపొందించినట్లు సమాచారం.
2014లో దీని నిర్మాణానికి ఆర్డర్ తీసుకున్న షిప్‌యార్డ్ నిర్ణీత సమయానికంటే ముందుగానే నౌకను సిద్ధం చేసింది. రూ.1,500 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ నౌకను స్థానిక షిప్‌యార్డ్ అధికారులు జలప్రవేశం చేయించారు. అయితే ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచారు.
యుద్ధ నౌక జలప్రవేశం
Published Tue, Apr 26 2016 4:11 AM | Last Updated on Sun, Sep 3 2017 10:43 PM
Advertisement
Advertisement