రాయల తెలంగాణ తమకు సమ్మతం కాదని బీజేపీ స్పష్టం చేసింది. తమ పార్టీ నిర్ణయంలో ఎటువంటి మార్పూ లేదని పునరుద్ఘాటించింది.
సాక్షి, హైదరాబాద్: రాయల తెలంగాణ తమకు సమ్మతం కాదని బీజేపీ స్పష్టం చేసింది. తమ పార్టీ నిర్ణయంలో ఎటువంటి మార్పూ లేదని పునరుద్ఘాటించింది. గుజ రాత్‌లో నిర్మించనున్న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహ ఏర్పాట్లపై సోమవారం ఇక్కడ వర్క్‌షాప్ జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి గుజ రాత్ న్యాయశాఖ మంత్రి ప్రదీప్ సింగ్ జడేజా, పార్టీ నేతలు డాక్టర్ కె.లక్ష్మణ్, సీహెచ్ విద్యాసాగరరావు, డాక్టర్ మల్లారెడ్డితో కలసి మీడియాతో మాట్లాడారు. రాయల తెలంగాణపై తమకు ఏ అధికారీ ఫోన్ చేయలేదని, ఈ అంశంలో తమ వైఖరి మారబోదని అన్నారు.
జీవోఎంకు ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. హైదరాబా ద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ మాత్రమే కోరుకుంటున్నామన్నా రు. గుజరాత్‌లో నిర్మించనున్న సమైక్యతా చిహ్నం- సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టినట్లు ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ప్రదీప్ సింగ్ జడేజా చెప్పారు. గుజరాత్‌లో పని చేస్తున్న తెలుగు ఐఎఎస్, ఐపీఎస్‌లు ఈనెల 29 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్, వైజాగ్, తిరుపతిలో పర్యటించి అవగాహన సదస్సుల్లో పాల్గొంటారన్నారు.