సదావర్తి భూములు కొనుగోలు చేశాం | We have purchased the lands of sadavarti | Sakshi
Sakshi News home page

సదావర్తి భూములు కొనుగోలు చేశాం

Published Tue, Jun 28 2016 9:17 AM | Last Updated on Mon, Oct 1 2018 4:15 PM

సదావర్తి భూములు కొనుగోలు చేశాం - Sakshi

సదావర్తి భూములు కొనుగోలు చేశాం

కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ

 సాక్షి, విజయవాడ బ్యూరో: చెన్నైలో సదావర్తి సత్రం భూములను తాము కొనుగోలు చేసిన మాట నిజమేనని కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ తెలిపారు. సోమవారం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. సదావర్తి సత్రం భూముల వేలం పాటలో తన కుమారుడు, అతని వ్యాపార భాగస్వాములు పాల్గొనడం నిజమేనని ఒప్పుకొన్నారు.

కానీ సత్రం భూముల వివరాలు పూర్తిగా తెలియక ఆ వ్యవహారంలోకి వెళ్లి ఇరుక్కుపోయామన్నారు. సత్రం భూములు అన్యాక్రాంతమయ్యాయని, కోర్టు వివాదాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఆ భూముల విలువ ఎకరం రూ. 6.5 కోట్లుంటుందని దేవాదాయ శాఖాధికారి తేల్చిన విషయం తెలియదా అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement