ఇరాక్ లో చిక్కుకున్నవారిని ఆదుకుంటాం: పల్లె | We take care of Telugu people of Iraq, Says Palle Raghunadha Reddy | Sakshi
Sakshi News home page

ఇరాక్ లో చిక్కుకున్నవారిని ఆదుకుంటాం: పల్లె

Published Thu, Jun 19 2014 6:45 PM | Last Updated on Sat, Sep 2 2017 9:04 AM

We take care of Telugu people of Iraq, Says Palle Raghunadha Reddy

హైదరాబాద్: ఇరాక్‌లో చిక్కుకున్న తెలుగువారిని ఆదుకుంటామని ఏపీ సమాచార శాఖా మంత్రి పల్లెరఘునాథరెడ్డి  స్పష్టం చేశారు. ఇరాక్ అల్లర్లలో చిక్కుకున్న ఎవరైనా వెనక్కి రావాలనుకుంటే ప్రభుత్వమే తీసుకువస్తుందని ఆయన హామీ ఇచ్చారు.  ఇరాక్ బాధితులకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  040-23454946, 9949054467 ఫోన్ నెంబర్ తో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. 
 
ఇరాక్ లో సున్ని, షియా తెగల మధ్య అంతర్యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఆక్కడ పరిస్థితులు హింసాత్మకంగా మారాయి. రెండు తెగల మధ్య జరుగుతున్న పోరు ఇరాక్ అనిశ్చిత పరిస్థితులను సృష్టించాయి. ఇరాక్ చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు ప్రారంభించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement