
నిజం.. నమ్మండి!
రాజంపేట పట్టణ నడిబొడ్డున రైల్వేకోడూరు రహదారిలోని పెట్రోలు బంకు ఉన్న స్ధలం లీజు వ్యవహారం మంగళవారం వెలుగులోకి వచ్చింది.
పట్టణాల్లో స్థలం కొనడం సామాన్యుడికి కలగా మారుతున్న పరిస్థితి... ఓ నాలుగు సెంట్లు స్థలం లీజుకు తీసుకుని వ్యాపారం చేయూలంటే ధరలు చూస్తే కళ్లు తిరగక మానవు... ఇది అందరూ చెప్పుకునే నేటి నిజం. ఇలాంటి రోజుల్లో రాజంపేటలో రూపారుుకే సెంటు స్థలం లీజుకు ఇచ్చారని అంటే ఎవరైనా ఏమంటారు... జోకుతున్నావా అనేగా. కాదండీ బాబు ఇది నిజం నమ్మండి అంటే... అవునా అదెలా అంటూ ఆశ్యర్యపోతున్నారు కదా! ఇదిగో ఆ లీజు కథ చదవితే మీకూ తెలుస్తుంది.
రాజంపేట: రాజంపేట పట్టణ నడిబొడ్డున రైల్వేకోడూరు రహదారిలోని పెట్రోలు బంకు ఉన్న స్ధలం లీజు వ్యవహారం మంగళవారం వెలుగులోకి వచ్చింది. కోట్లాది రూపాయిలు విలువ చేసే దాదాపు 19సెంట్లు స్ధలం కేవలం రూ19ల లీజుతో నడుస్తోంది. ఒకటి రెండు రోజులు కాదు ఆరు దశాబ్దాల క్రితం చేసుకున్న ఒప్పందం ప్రకారమే నేటికే నడుస్తుండడం తెలిసి పురపాలిక అధికారులు విస్తుపోయూరు.
పట్టణంలో అమ్మవారిశాల స్ధలం సమీపంలో ఉన్న 19 సెంట్ల స్ధలాన్ని 10.11.1954లో అప్పటి పంచాయతీ అధికారులు బర్మాసెల్ ఆయిల్ కంపెనీకి లీజుకు అప్పగించినట్లు రికార్డులు చెబుతున్నారుు. పంచాయతీకి ఆయిల్‌సంస్ధ కట్టాల్సింది రూ19ల మాత్రమే. అయితే అదైనా సక్రమంగా కడుతున్నారా? లేదా అనేది కూడా తెలియని పరిస్థితి.
బర్మాసెల్ ఆయిల్ కంపెనీ తర్వాత కాలంలో భారత్‌పెట్రోలియం సంస్ధకు అప్పగించగా పెట్రోలు బంకును నిర్వహిస్తూ వచ్చారు. రూ19ల లీజుతో ఎన్నేళ్లు ఇచ్చారనేది తెలియడంలేదు. దానికి సంబంధించిన రికార్డుల కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. దాదాపు రూ.8కోట్ల విలువ చేసే స్ధలం లీజు నేటికీ రూ.19లేనా అన్నది పట్టణవాసులను తొలిచివేస్తున్న ప్రశ్న.
పరిశీలించిన పురపాలిక అధికార్లు
తక్కువ లీజులో ఇన్నాళ్లుగా కొనసాగుతున్న పెట్రోలు బంకు స్ధలాన్ని మంగళవారం పరిశీలించినట్లు పురపాలక కమిషనర్ ఫజులుల్లా తెలిపారు. స్ధలాన్ని స్వాధీనం చేసుకొని బోర్డు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కమిషనర్‌తోపాటు టౌన్‌ప్లాన్ అధికారి బాలాజీ, ఇతర పురపాలక ఇంజనీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పెట్రోలు బంకు స్ధలంతోపాటు ఎగువ భాగంలో మరికొంత స్థలం ఉందని గుర్తించామని, సర్వే చేయిస్తామన్నారు. లీజుకు ఇచ్చిన వ్యవహారం సమాచారం సేకరించే పనిలో ఉన్నామన్నారు. ప్రస్తుతం ఈ బంకును శ్రీనువాసులు అనే వ్యక్తి నిర్వహిస్తున్నారని వివరించారు. బంకు నిర్వహకుని సంప్రందిస్తే లీజు విషయం వాస్తవ మేనని చెపుతున్నారని చెప్పారు.
సాక్షి కథనాలతో కదిలిక
పట్టణంలో రూ.కోట్ల విలువ చేసే స్ధలాలు అన్యాక్రాంతంలో ఉన్నాయని.. కబ్జాకు బడాబాబులు ప్రయత్నిస్తున్నారంటూ సాక్షి కథనాలతో పురపాలక అధికారుల్లో కదిలిక వచ్చింది. ఇప్పటికే అనేక స్ధలాలను అధికారులు గుర్తించి బోర్డులు నాటారు. నారపురెడ్డిపల్లెలో ఏకంగా ఎకరా స్ధలాన్ని స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. పట్టణంలో వివిధ పురపాలక స్ధలాలను అప్పజెప్పే విధంగా సాక్షిలో కథనాలు వెలువడటంతో పట్టణవాసులు అభినందిస్తున్నారు.