ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సముచిత స్థానం
కేంద్ర మంత్రి జైరాం రమేశ్ హామీ
డీసీసీ సమావేశంలో అధినేత్రిపై ప్రశంసల వర్షం
టీఆర్‌ఎస్‌తో పొత్తూ వద్దన్న జిల్లా నేతలు
కంచుకోటను నిలుపుకుంటామన్న ఎమ్మెల్యేలు
మాజీ డిప్యూటీ సీఎం దామోదర గైర్హాజరు
సాక్షి, సంగారెడ్డి:
‘ఎన్నికల ముందు ఓట్ల కోసం తెలంగాణను ఏర్పాటు చేయడం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళల చేతిలో అధికారాన్ని పెట్టేందుకే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం..’ అని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేశ్ స్పష్టం చేశారు. అన్నీ సామాజిక వర్గాలకు సమన్యాయం చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. రానున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు చెందిన బీసీలు, మైనారిటీలకు న్యాయం చేయాలని ఆ పార్టీ జిల్లా నేతల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై ఆయన పరోక్షంగా స్పందిస్తూ పై వ్యాఖ్యాలు చేశారు. సంగారెడ్డి మండలం పొతిరెడ్డిపల్లిలోని పీఎస్‌ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం జరిగిన జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంతకు ముందు అక్కడే ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్ర పునర్విభజన బిల్లు ఏర్పాటులో ఎదురైన అనుభవాలు, కాంగ్రెస్ అనుసరించిన వైఖరీని విషదికరించారు. లోక్‌సభలో తెలంగాణ బిల్లును సమర్థించిన బీజేపీ రాజ్యసభలో మాత్రం వ్యతిరేకించి ద్వంద్వ ప్రమాణాలు పాటించిందన్నారు. రాజ్యసభలో టీ-బిల్లు చట్ట విరుద్ధమంటూ బీజేపీ సభ్యులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడులు తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. టీడీపీలో సగం మంది బిల్లుకు మద్దతు ఇస్తే సగం మంది వ్యతిరేకించారన్నారు. ఒకానొక దశలో బిల్లు పాస్ కావడం కష్టంగా మారినా కాంగ్రెస్ చిత్తశుద్ధి ముందు ఈ సమస్యలన్నీ చిన్నగా మారాయన్నారు.
టీఆర్‌ఎస్‌తో పోత్తూ వద్దు..
టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయకపోయినా..ఆ పార్టీతో పొత్తు లేకపోయినా ఒంటరిగా పొటీ చేసి గెలవగల సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉందని జైరాం రమేశ్ ధీమా వ్యక్తం చేశారు. ఇదే అంశంపై డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌తో పొత్తు వద్దని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. మెదక్ జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట అని, వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని రెండు లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ గెలుపొందడం ఖాయమన్నారు. ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు మాట్లాడుతూ 60 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ముందుండి నడిచారన్నారు. తెలంగాణ ఏర్పడితే తమ జీవితాల్లో మార్పులు వస్తాయని ఆ వర్గాలు భావిస్తున్నాయని..వారి ఆశలను సాకారం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. జిల్లాలో 10 శాసనసభ స్థానాలుంటే రెండు స్థానాల్లో ఎస్సీలు, ఓ స్థానంలో బీసీ ఎమ్మేల్యేలు, మిగి లిన ఏడు స్థానాల్లో ఓసీలు ఎమ్మెల్యేలుగా ఉన్నారన్నారు. రాను న్న ఎన్నికల్లో జిల్లాలో బీసీలకు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తన డిమాండును జైరాం రమేశ్ చెవిలో వేసేందుకు ఆయన హిందీలో ప్రసంగించారు. సోని యా గాంధీని తెలంగాణ ప్రజలు దేవతగా పూజిస్తున్నారని ప్ర శంసలతో ముంచెత్తారు.
జిల్లాలో మైనారిటీలకు సైతం ఓ సీటు ను కేటాయించాని నందీశ్వర్ కోరారు. దీనిపై సంగారెడ్డి ఎమ్మె ల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి స్పందిస్తూ ..‘నీ పదవిని రక్షించుకోడానికి ఇతరుల పదవులకు ఎసరుపెడుతావా..?’ అని సరదాగా వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి, జహీరాబాద్ ఎ మ్మెల్యే జే గీతారెడ్డి మాట్లాడుతూ గవర్నర్ కోటాలో మాజీ మంత్రి ఫరీదొద్దీన్‌ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేశారు.జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, ఈ సమావేశంలో మా జీ మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, ఫరీదుద్దీన్, ఎమ్మెల్యేలు పికి ష్టారెడ్డి, చెరుకు ముత్యం రెడ్డి, నర్సారెడ్డి తదితరులుపాల్గొన్నారు.
దామోదర గైర్హాజరు: కేంద్రమంత్రి జైరాం రమేశ్ పాల్గొన్న సమావేశానికి దాదాపు జిల్లా కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు అందరూ హాజరైనా మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. ఆయనతో పాటు ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ సైతం గైర్హాజరయ్యారు.
సమన్యాయం చేస్తాం
Published Sun, Mar 9 2014 10:07 PM | Last Updated on Fri, Nov 9 2018 5:41 PM
Advertisement
Advertisement