మేము అధికారంలోకి రావాలని దేశమంతా కోరుకుంటోంది | andhra-pradesh-bifurcation-bill | Sakshi
Sakshi News home page

మేము అధికారంలోకి రావాలని దేశమంతా కోరుకుంటోంది

Published Thu, Dec 3 2015 10:51 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM

మేము అధికారంలోకి రావాలని దేశమంతా కోరుకుంటోంది - Sakshi

మేము అధికారంలోకి రావాలని దేశమంతా కోరుకుంటోంది

పార్లమెంట్‌లో ఏం జరిగింది-31
 
విభజన బిల్లుపై 20-02- 2014న రాజ్యసభలో చర్చ కొనసాగింపు.
 
జైరాం రమేష్: పనులవుతున్నాయి. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలంటే...
వెంకయ్యనాయుడు: లేదు లేదు. షెడ్యూల్ ప్రకారం దుమ్ముగూడెం ప్రాజెక్టు పూర్తి చేసి, రాయలసీమకు సాయం అందించాలనే అడుగుతున్నా.
డిప్యూటీ చైర్మన్: జైరాం గారూ ఇప్పటికే డబ్బు ఖర్చు పెట్టారు. అదే మాట చెప్పండి.
జైరాం రమేష్: బిల్లులో స్పష్టంగా ఉంది. ఇప్పుడున్న అన్ని ప్రాజెక్టులూ కొనసాగుతాయని షెడ్యూల్ ప్రకారం పూర్తవుతాయని ఉంది. అన్ని ప్రాజెక్టులూ...
డిప్యూటీ చైర్మన్: ఏమంటారు వెంకయ్యనాయుడు గారూ!
వెంకయ్యనాయుడు: సవరణ విషయమై ఒత్తిడి చెయ్యను.
డిప్యూటీ చైర్మన్: సవరణ లేదు. 11వ షెడ్యూల్ ఓటింగ్‌కి పెడ్తున్నా.
11వ షెడ్యూల్ బిల్లులో కలపబడింది.
12వ షెడ్యూల్ బిల్లులో కలపబడింది.
ఇప్పుడు 13వ షెడ్యూల్ పది సవరణలు ప్రతిపాదించారు. వెంకయ్యనాయుడు గారూ!
వెంకయ్యనాయుడు: సార్, ప్రభుత్వం కొన్ని హామీ లు ఇచ్చింది. ‘‘తగు చర్యలు తీసుకుంటాం’’ అని చెప్పిం ది. ప్రభుత్వం ‘‘ఫలానా సమయంలోపు పూర్తి చెయ్యాలి’’ అని కచ్చితంగా చెప్పాలని నేను ప్రతిపాదించాను. ఇవ్వాళ మీరు ‘చర్యలు’ అన్నారు. రెండు నెలల తర్వాత మీరు అక్కడ ఉండకపోవచ్చు. వేరే ఎవరో రావొచ్చు.. లేదు లేదు మేమే వస్తాం. మా ప్రభుత్వమే ఏర్పడుతుంది.
డిప్యూటీ చైర్మన్: వెంకయ్యనాయుడు గారూ, వాళ్లు ఒప్పుకోవటం లేదు.
వెంకయ్యనాయుడు: మొత్తం దేశమంతా మేము అధికారంలోకి రావాలని అనుకుంటున్నారు. వాళ్లు పోతున్నారు. అందులో సందేహమే లేదు. కానీ నేను వాళ్లని నిజాయితీగా ఉండమంటున్నా. స్పష్టంగా చెప్పండి. 70 వ పేజీలో విద్య అనే హెడ్డింగ్ కింద ఐఐటీల గురించి ప్రస్తావించారు. ‘‘చర్యలు తీసుకుంటాం’’ అనే బదులు.. చేస్తున్నాం (shall) అని చెప్పాలి.
డిప్యూటీ చైర్మన్: స్పష్టంగా చెప్పాలి అని అంటున్నారు.
జైరాం రమేష్: 13వ షెడ్యూల్ స్ఫటికమంత స్పష్టంగా ఉంది. ‘‘చర్యలు తీసుకుంటున్నాం’’ అంటే చర్యలు తీసుకోవాలి కదా. ప్లానింగ్ కమిషన్ అనుమతి తీసుకోవాలి, ఆర్థికశాఖ అనుమతి, కేబినెట్ అనుమతి...
డిప్యూటీ చైర్మన్: ప్రభుత్వం అనేది నిరంతరం నడిచేది.
జైరాం రమేష్: వెంకయ్య నాయుడు చాలా సీనియర్ సభ్యులు. ప్రభుత్వం 'may’  అనలేదు. ‘‘గవర్నమెంట్ shall’’ అన్నాం. అంటే కట్టుబడి ఉన్నాం.
డిప్యూటీ చైర్మన్: వెంకయ్యగారూ, ప్రభుత్వం నిరంతరం నడుస్తూనే ఉంటుంది. ఎందుకు వర్రీ అవుతారు?
వెంకయ్యనాయుడు: సార్ నేను చెప్పేది పద ప్రయోగం గురించి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే చోట 17వ పేజీలో ఒక సారి చదవండి. ‘‘ఆరు నెలల్లో పరీక్షించి’’ అని ఉంది. అంటే ‘‘పరీక్షించి తిరస్కరించి’’ అని కూడా అర్థం వస్తుంది.
జైరాం రమేష్: నేను చెబుతాను. ప్రభుత్వమే చేయగలిగే పనులకు shall అన్నాం. కానీ కొన్ని ఎన్టీపీసీ లాంటి, స్టీల్ అథారిటీ, ఐఓసీ లాంటి పబ్లిక్ సెక్టార్ కంపెనీలు చేయవల్సినవి ఉన్నాయి. వాటి తరఫున ప్రభుత్వం మాట ఇవ్వలేదు.
డిప్యూటీ చైర్మన్: వెంకయ్యగారు ఒప్పుకోడానికి సిద్ధంగా ఉన్నారు.
జైరాం రమేష్: నన్ను పూర్తి చెయ్యనివ్వండి.
డిప్యూటీ చైర్మన్: ఓకే. అదే నిర్ణయం అంటే.
జైరాం రమేష్: నన్ను పూర్తి చెయ్యనివ్వండి. ప్రభుత్వరంగ సంస్థల స్వయం ప్రతిపత్తిని మీరు గౌరవిస్తారనే నేననుకుంటున్నా. పబ్లిక్ రంగంలోని సంస్థల తరఫున మనం నిర్ణయాలు తీసుకోం. ఎన్‌టీపీసీ, సెయిల్, ఐఓసీలు పెట్టే పెట్టుబడుల విషయమై నిర్ణయం వారే తీసుకోవాలి. అందుకే, 6 నెలల్లో సాధ్యాసాధ్యాల విషయమై అధ్యయనం పూర్తి చెయ్యమన్నాం. ఈ అధ్యయనం చేయకుండా, పెద్ద పెట్టుబడులు రావటం అసాధ్యం. కానీ ఐఐటీ, ఐఐఎం, ఎఐఐఎంఎస్ వంటి వాటి విషయమై ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. అందుకే ‘గవర్నమెంట్ షల్’ అన్నాం. గౌరవ సభ్యులు ప్రభుత్వ పెట్టుబడి, పబ్లిక్‌రంగ సంస్థల పెట్టుబడుల సంఖ్య తేడా గమనించాలి.
 
డిప్యూటీ చైర్మన్: వెంకయ్యనాయుడు గారూ సవరణ విషయమై ఒత్తిడి లేదుగా...
వెంకయ్య నాయుడు: లేదండి.
డిప్యూటీ చైర్మన్: మంత్రిగారు ఇచ్చిన వివరణ నేపథ్యంలో...
రవిశంకర్ ప్రసాద్: జైరాంగారూ! మీరు పబ్లిక్ రంగ సంస్థలు తొందరగా పని పూర్తి చేసేలా ప్రభుత్వం తరఫున ఒత్తిడి తేవాలి. తెస్తారా?
జైరాం రమేష్: మేము మళ్లీ అధికారంలోకి వస్తే తప్పకుండా తెస్తాం.
డిప్యూటీ చైర్మన్: సరే, ఇంతకంటే భరోసాగా ఎవరూ చెప్పలేరు. వెంకయ్యగారూ మీ సవరణ... ఒత్తిడి లేదుగా!
వెంకయ్య నాయుడు: మంత్రి గారి మాట, రెండు నెలల్లో ఎలాగూ మేము అధికారంలోకి వస్తున్నామన్న నమ్మకం వలన నేనిక ముందుకెళ్ల దల్చుకోలేదు.
డిప్యూటీ చైర్మన్: 13వ షెడ్యూల్ ఓటింగ్ పెడ్తున్నా.
13వ షెడ్యూల్ బిల్లులో చేర్చబడింది.
డిప్యూటీ చైర్మన్: డెరిక్ ఒబ్రియిన్‌ గారు ఒక సవరణ ప్రతిపాదించారు. డెరిక్ ఒబ్రియిన్‌ గారూ... మీరు వెల్‌లో నిరసనలో ఉన్నారా? మిమ్మల్ని పట్టించుకోనవసరం లేదు.
క్లాజ్-1 బిల్లులో చేర్చబడింది.
డిప్యూటీ చైర్మన్: షిండే గారూ!
షిండే: బిల్లు పాస్ చెయ్యవల్సిందిగా ప్రార్థిస్తున్నాను.
ఏచూరి: ఓటింగ్ డివిజన్ కావాలి... డివిజన్ కావాలి.
డిప్యూటీ చైర్మన్: ఎలా ఓటింగ్ జరపగలం? ఇలా ఉంటే?
- ఉండవల్లి అరుణ్‌కుమార్
వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు: a_vundavalli@yahoo.com

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement