'ఏపీ పరిస్థితి ఆర్బీఐ గవర్నర్కు వివరించాం' | We will explain on Andhra Pradesh State Financial Situation to RBI Governor, says Yanamala Ramakrishnudu and Sujana chowdary | Sakshi
Sakshi News home page

'ఏపీ పరిస్థితి ఆర్బీఐ గవర్నర్కు వివరించాం'

Published Wed, Oct 15 2014 2:41 PM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM

'ఏపీ పరిస్థితి ఆర్బీఐ గవర్నర్కు వివరించాం' - Sakshi

'ఏపీ పరిస్థితి ఆర్బీఐ గవర్నర్కు వివరించాం'

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ను కోరినట్లు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఎంపీ సుజనా చౌదరి వెల్లడించారు. బుధవారం హైదరాబాద్లో రఘురాం రాజన్తో భేటీ అనంతరం యనమల, సుజనా చౌదరి విలేకర్లతో మాట్లాడుతూ... రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రాజన్కు వివరించినట్లు చెప్పారు. అలాగే తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు సాధికారిత కార్పోరేషన్ గురించి ఆయనకు  వివరించినట్లు చెప్పారు.

రాష్ట్రంలో బ్యాంకు అకౌంట్లకు ఆధార్ నెంబర్లు అనుసంధానం చేసిన తమ ప్రభుత్వానికి రాజన్ అభినందనలు తెలిపారన్నారు. విజయవాడలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం కోసం స్థలం కేటాయించాలని గవర్నర్ రాజన్ తమను కోరారని యనమల, సుజనా చౌదరి వెల్లడించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement