సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల మనోభావలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తీసుకున్నారని కేంద్రమంత్రి జేడీ శీలం అన్నారు.
ఒంగోలు : సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల మనోభావలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తీసుకున్నారని కేంద్రమంత్రి జేడీ శీలం అన్నారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ చివర వరకూ పోరాడి ప్రజలకు న్యాయం చేస్తామన్నారు. కాంగ్రెస్లో పదవులు అనుభవించి అదే పార్టీపై నిందలు వేయటం సరైన పద్దతి కాదని జేడీ శీలం వ్యాఖ్యానించారు. కాగా మరో కేంద్రమంత్రి పనబాక లక్ష్మి కూడా సొంతపార్టీ ఎంపీలపై మండిపడిన విషయం తెలిసిందే. పార్టీలో ఉండి పదవులు అనుభవిస్తూ విమర్శలు చేయటం తగదని ఆమె హితవు పలికారు.