అసదుద్దీన్ ఓవైసీ
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపధ్యంలో హైదరాబాద్ నగర శాంతి భద్రతలను గవర్నర్కు అప్పగిస్తే తాము సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఓవైసీ హెచ్చరించారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ పాలనా పగ్గాలను గవర్నర్కు అప్పగించడాన్ని ఆయన మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు.
ఈ నిబంధనను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని చెప్పారు. శాంతిభద్రతల అంశం రాష్ట్ర పరిధిలోని వ్యవహారమైనందున ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమన్నారు.
తెలంగాణ బిల్లును యథాతథంగా అమలు చేస్తే 620 చదరపు కిలోమీటర్ల జీహెచ్‌ఎంసీ ప్రాంతం మొత్తం గవర్నర్ చేతిలోకి వెళుతుంది.