'జగన్ దీక్షపై వైద్యుల సలహా పాటిస్తాం' | We will take doctors advise says chanchalguda jail officials due to YS Jagan deeksha | Sakshi
Sakshi News home page

'జగన్ దీక్షపై వైద్యుల సలహా పాటిస్తాం'

Published Thu, Aug 29 2013 2:17 PM | Last Updated on Sat, Jul 28 2018 6:26 PM

'జగన్ దీక్షపై వైద్యుల సలహా పాటిస్తాం' - Sakshi

'జగన్ దీక్షపై వైద్యుల సలహా పాటిస్తాం'

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష గురువారం ఐదో రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఆయన్ని వైద్యులు పరీక్షిస్తున్నారని చంచల్గూడ జైలు అధికారులు గురువారం హైదరాబాద్లో తెలిపారు. జగన్ దీక్షపై వైద్యుల సలహాల మేరకు నడుచుకుంటామని వారు స్పష్టం చేశారు. జగన్ ఆరోగ్యంగా ఉన్నంత వరకు ఆయన్ని బలవంతపెట్టమని పేర్కొన్నారు. వైద్యుల సూచనల మేరకు అవసరమైన వైద్యాన్ని జగన్కు అందిస్తామని తెలిపారు.

 

అయితే జగన్ను ఆసుపత్రికి తరలించే విషయన్ని మాత్రం ఇప్పడే చెప్పలేమని జైలు అధికారులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంచల్గూడ జైల్లో ఆదివారం ఆమరణ నిరాహరదీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement