రాష్ట్ర విభజన ప్రక్రియలో రాజ్యాంగ నిబంధనల్ని పాటించాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్లకు లేఖలు రాసినట్టు సమైక్యాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ ఎస్.శైలజానాథ్ చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం సరికాదని మంత్రి అన్నారు.
అసెంబ్లీ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశంలో ఇప్పటి వరకూ ఏ రాష్ట్రాన్ని విభజించలేదని శైలజానాథ్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి విభజన అంశం ఏ రూపంలో వచ్చినా వ్యతిరేకిస్తామని చెప్పారు.
విభజనపై రాష్ట్రపతి, ప్రధానులకు లేఖలు రాశాం: శైలజానాథ్
Published Sat, Oct 19 2013 7:08 PM | Last Updated on Fri, Sep 1 2017 11:47 PM
Advertisement
Advertisement