వజ్రకరూరు : జిల్లాలో వాతావరణ బీమా పంపిణీకి బ్రేక్ పడింది!. అధికారుల ద్వారా అందిన సమాచారం మేరకు.. జిల్లా ఉన్న 63 మండలాలకు గాను 58 మండలాల్లోని 98 సహకార సంఘాల (సొసైటీ)కు 2013 సంవత్సరానికి సంబంధించి వాతావరణ బీమా మంజూరైంది. ఇందులో భాగంగా వజ్రకరూరు మండలంలోని సింగిల్ విండోకు హెక్టారుకు రూ.8818 చొప్పున మొత్తం రూ.కోటి 31 లక్షలు మంజూరైంది.
జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఈనెల 1న వజ్రకరూరు ఏడీసీసీ బ్యాంక్‌లో బీమా పంపిణీ ప్రారంభించి దాదాపు 200 మందికి పైగా రైతులకు అందజేశారు. మిగిలిన రైతులకు కూడా పంపిణీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రభుత్వం 218 జీవోను విడుదల చేసింది. ఈ జీవోలో ప్రధానంగా రుణమాఫీ నిబంధనలను అనుసరించి, రుణ మాఫీ జాబితాను ప్రకటించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఉత్తర్వులను కాదని చర్యలు చేపడితే అధికారులే అందుకు బాధ్యులు కావాల్సి వస్తుందని కూడా పేర్కొన్నట్లు సమాచారం.
పైగా తక్షణం వాతావరణ బీమా పంపిణీని నిలిపివేయూలని అధికారులకు మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. దీంతో జిల్లాలో వాతావరణ బీమా పంపిణీకి బ్రేక్ పడినట్లరుుంది. జిల్లాలో ఇప్పటికే రైతులు కొత్త రుణాలు అందక పంట పెట్టుబడి కోసం అప్పు తెచ్చుకున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో సొసైటీల ద్వారా మంజూరైన వాతావరణ బీమా కొంతైనా తమను ఆదుకుంటుందని రైతులు భావించారు. తాజా జీవోతో రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లరుుంది.
వాతావరణ బీమా పంపిణీకి బ్రేక్!
Published Mon, Dec 8 2014 3:14 AM | Last Updated on Sat, Sep 2 2017 5:47 PM
Advertisement