ఆన్‌లైన్‌లో అప్పుల పట్టిక | Online balance sheet | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో అప్పుల పట్టిక

Published Mon, Dec 8 2014 3:12 AM | Last Updated on Sat, Sep 2 2017 5:47 PM

Online balance sheet

సాక్షిప్రతినిధి, అనంతపురం : రుణమాఫీకి సంబంధించి అర్హుల జాబితాను వెబ్‌సైట్‌లో పెట్టామని ప్రభుత్వం ప్రకటించినా ‘అనంత’ అన్నదాతల్లో ఇంకా ఉత్కంఠ వీడలేదు. సర్వర్ సమస్యతో వెబ్‌సైట్ ఓపెన్ కాకపోవడం..
 
 ఆదివారం కావడంతో అధికారులు సెలవులో ఉండడంతో జిల్లాకు సంబంధించి ఎంత మంది అర్హులున్నారు? ఎన్ని కోట్లు మాఫీకానున్నాయన్న వివరాలు తెలియరాలేదు. సోమవారం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో రైతులు జాబితా కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
 
 జిల్లాలో ఆంధ్రాబ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియూ, డీసీసీబీ, కో ఆపరేటివ్, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుతో పాటు పలు బ్యాంకుల నుంచి రైతులు రుణాలు తీసుకున్నారు. ప్రభుత్వం రుణమాఫీ జాబితాను ఆన్‌లైన్‌లో ఉంచి బ్యాంకుల వారీగా పాస్‌వర్డ్‌లు కేటారుుంచింది. దీంతో ఆయూ బ్యాంకులకు సంబంధించిన ఖాతాలు మాత్రమే తెలిసే పరిస్థితి ఉంది.  
 
 10 నుంచి ఖాతాల్లోకి నగదు బదిలీ
 రుణమాఫీ అర్హుల జాబితా ఈనెల 8వ తేదీ బ్యాంకులకు అందిస్తామని ప్రభుత్వం పేర్కొంది. రైతులు బ్యాంకులకెళ్లి జాబితాలో పేర్లు పరిశీలించుకోవాలని సూచించింది. దీంతో రూ.50 వేల లోపు ఉంటే పూర్తిగా మాఫీ అరుుందా? లేదా రూ.50 వేలకు పైగా ఉంటే 20 శాతం మాఫీ చేశారా? అన్న వివరాలు తెలుసుకునే వీలుంటుంది. కాగా జిల్లాలో పంట, బంగారు, టర్మ్, అనుబంధ రుణాలన్నీ కలిపి 10,24577 మందికి సంబంధించి రూ.6,817.61 కోట్లు ఉన్నాయి.
 
 అయితే రాష్ట్ర ప్రభుత్వం పంట రుణాలు, బంగారు రుణాలకు సంబంధించి గరిష్టంగా రూ.1.50 లక్షలు మాఫీ చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో జిల్లాలో పంట రుణాలు 6,08,874 అకౌంట్ల పరిధిలో రూ.3,093.06 కోట్లు, బంగారు రుణాలు 2,12,057 అకౌంట్ల పరిధిలో రూ.1,851.18 కోట్లు ఉన్నాయి. రుణమాఫీ అమలు ఆలస్యం కావడంతో దాదాపు రుణాలన్నీ గడువుమీరిన (ఓవర్‌డ్యూస్) జాబితాలో ఉన్నట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. వీటికి అన్ని రకాల వడ్డీలు కలిపి అదనంగా రూ.650 నుంచి 700 కోట్ల వరకు భారం పడుతుంది. ఈ క్రమంలో రుణమాఫీ తొలివిడతగా ఎంత మందికి ఎన్ని కోట్లు వర్తిస్తుందనేది వేచిచూడాలి. ఇదిలా వుండగా రైతుల ఖాతాల్లోకి నగదును బదిలీ ఈ నెల 10 నుంచి జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 22.79 లక్షల ఖాతాలు అర్హత సాధించాయని ఈ నెల 4న రుణమాఫీపై విధాన ప్రకటన చేసిన సమయంలో చంద్రబాబు పేర్కొన్నారు.  ఇందులో జిల్లాకు సంబంధించి 8.68 లక్షలు ఉన్నాయి. ‘అనంత’కు సంబంధించిన మొత్తం ఖాతాలు అర్హత సాధించాయనుఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా తక్కిన ఖాతాలు 14.11లక్షలు. ఈ ఖాతాలను ‘అనంత’ మినహా మిగతా 12 జిల్లాలో సగటున జిల్లాకు లక్ష ఖాతాలు  చొప్పున మాత్రమే అర్హత సాధించినట్లవుతాయి. ఈ లెక్కన ‘అనంత’లోని 8.68 లక్షల ఖాతాలకు మాఫీ జరగడం కష్టసాధ్యమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జిల్లా అధికారులు పంపిన ఖాతాల్లో చాలా వరకు అర్హత జాబితాలోకి చేరవని తెలుస్తోంది.
 
 జిల్లా నుంచి పంపిన ఖాతాలు 9.86లక్షలు:
 జిల్లా వ్యాప్తంగా 10.24 లక్షల ఖాతాలున్నాయి. ఇందులో రుణమాఫీ అమలు కోసం జిల్లా నుంచి 9.86 లక్షల ఖాతాల వివరాల సేకరించి అప్‌లోడ్ చేశారు. వీటిలో ఆధార్, రేషన్‌కార్డు లేక 1.18 లక్షల అకౌంట్లు తిరస్కారానికి గురయ్యాయి. దీంతో 8.68 లక్షల ఖాతాలు అర్హత జాబితాలో ఉన్నాయి. వీటిలో ఎన్ని ఖాతాలను ప్రభుత్వం రుణమాఫీ జాబితాలో చేర్చించింది? ఎన్ని మలివిడత తిరస్కరణకు గురయ్యాయనేది నేడు తేలనుంది. మొత్తం ఖాతాల్లో  చిన్నకారు రైతులవి 5.80 లక్షలు, సన్నకారు రైతులవి 1.92 లక్షలుగా తక్కిన 2.14 లక్షల అకౌంట్లు పెద్దరైతులవిగా పరిగణించారు.
 
 వివరాలు నాకు పంపలేదు: జయశంకర్, లీడ్‌బ్యాంక్ మేనేజర్
 రుణమాఫీ అర్హత ఖాతాల వివరాలు ప్రభుత్వం నాకు పంపలేదు. ఆయా బ్యాంకులకు పాస్‌వర్డ్‌లు కేటాయించి వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. జిల్లా వ్యాప్తంగా వివరాలు తెలియాలంటే అన్ని బ్యాంకుల ఖాతాలను పరిగణలోకి తీసుకుని లెక్కించాలి. పూర్తి వివరాలు సోమవారం తెలిసే అవకాశం ఉంది. మా లెక్కల ప్రకారం 8.68లక్షల ఖాతాలు అర్హత సాధించాయి. మరి ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎన్ని ఖాతాలు అర్హుల జాబితాలోకి చేరాయో వేచి చూడాలి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement