కిరణ్ కొత్త పార్టీ తెరవెనుక వ్యూహకర్తలు టీడీపీ మాజీ ఎంపీలు
సాక్షి, హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా మాచవరం చిరునామాతో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఇదివరకే రిజిస్టర్ చేసిన ‘జై సమైక్యాంధ్ర’ పార్టీని తీసుకొని కొనసాగించాలని మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ పేరుతో పార్టీని రిజిస్టర్ చేసింది టీడీపీ మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరిరావు. ఈయనతో పాటు మరో మాజీ ఎంపీ చిట్టూరు రవీంద్ర కూడా ఈ పార్టీకి సంబంధించిన కసరత్తులో కీలకపాత్ర పోషిస్తున్నట్లు చెబుతున్నారు. వీరిద్దరూ తోడళ్లుల్లు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణకు చుండ్రు శ్రీహరి వియ్యంకుడు.
వీరిద్దరితో పాటు ఉండవల్లి అరుణ్‌కుమార్, హర్షకుమార్ సూచనల మేరకు తొలి సభను రాజమండ్రి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే కొత్త పార్టీకి సంబంధించిన జెండాలు, ఇతర ప్రచార సామగ్రి తయారీ పూర్తయిందని, ఈనెల 12న రాజమండ్రిలో జరిగే సభలో టీడీపీకి చెందిన ఈ మాజీ ఎంపీలతోపాటు మరి కొంతమంది నాయకులు పాల్గొంటారని తెలుస్తోంది. ఇలా ఉండగా కిరణ్ కొత్తపార్టీ ప్రకటించిన సమయంలో ఆయన వెంట కాంగ్రెస్ బహిష్కృత ఎంపీ రాయపాటి సాంబశివరావు లేరు. మీడియా సమావేశం అనంతరం ఆయన కిరణ్‌ను కలిశారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ కిరణ్ పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు.
పార్టీ ‘జై సమైక్యాంధ్ర’... గుర్తు ‘చెప్పు’
Published Fri, Mar 7 2014 4:25 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement