చింతపల్లి, న్యూస్‌లైన్: జీవితాంతం తోడు నీడగా ఉంటానని ప్రమాణం చేసి తాళి కట్టించుకుంది.. భర్తకు రేచీకటి అని తెలియగానే పుట్టింటికి వెళ్లిపోయింది.. అక్కడే మరొకరితో ప్రేమాయణం సాగించి వివాహం చేసుకుంది.. ఇది తెలిసిన మొదటి భర్త తనకు విడాకులు ఇవ్వకుండా ఎలా పెళ్లి చేసుకుంటావని ప్రశ్నించినందుకు రెండో భర్తతో హత్య చేయించింది. చింతపల్లి మండలం తిరుగండ్లపల్లి గ్రామ శివారు బ్రహ్మదేవుని గుడివద్ద జూలై 2వ తేదీన జరిగిన నారోజు రాఘవేంద్రచారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. చింతపల్లి పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను డీఎస్పీ సోమశేఖర్ వెల్లడించారు.
విశాఖ జిల్లా మర్రిగూడ మండలం తిరుగండ్ల పల్లి గ్రామానికి చెందిన నారోజు రాఘవేంద్రచారికి హైదరాబాద్ భర్కత్‌పురాకు చెందిన పోలోజు ధనలక్ష్మితో 2009 లో వివాహం జరిగింది. వృత్తిరీత్యా రాఘవేంద్రచారి అంత్రాలు కడుతూ జీవనం సాగిస్తున్నాడు. భర్తకు రేచీకటి ఉందని కళ్లు సరిగా కనపడవని తెలిసిన ధనలక్ష్మి పెళ్లి జరిగిన వారం రోజులకే పుట్టింటికి వెళ్లిపోయింది. హైదరాబాద్‌లో తన నాయనమ్మ వద్ద ఉంటుంది. ఈ క్రమంలో అక్కడే ఇంటికి ఎదురుగా ఉన్న పూల వ్యాపారి బత్తుల సంతోష్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. తన స్నేహితురాళ్ల సహాయంతో ధనలక్ష్మి 2013 మార్చిన యాదగిరిగుట్టలో సంతోష్‌ను వివాహం చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న మొదటి భర్త రాఘవేంద్రచారి తనకు విడాకులు ఇవ్వకుండా మరో పెళ్లి ఎలా చేసుకుంటావని ప్రశ్నించాడు. పెళ్లి నాటి ఫొటోలు చూపి ంచి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు.
వైద్యం చేయాలని..
మరో పెళ్లి చేసుకుని హాయిగా జీవనం సాగిస్తున్న ధనలక్ష్మి మొదటి భర్త రాఘవేంద్రచారి అడ్డుతొలగించుకోవాలని నిశ్చయించుకుంది. ఈ విషయాన్ని సంతోష్‌తో చెప్పగా అతను తన స్నేహితులైన సాయి, ఠాగూర్‌లతో కలిసి రాఘవేంద్రచారిని హైదరాబాద్‌కు పిలిచి హత్య చేయాలనుకున్నాడు. భూతవైద్యం పేరుతో అంత్రాలు కట్టే రాఘవేం ద్రచారికి సాయికి ఆరోగ్యం బాగాలేదని, మీరు బాగా చేస్తారని తెలిసి మిమ్మల్ని సంప్రదిస్తున్నామని ఫోన్ చేశారు. హైదరాబాద్‌కు వచ్చి వైద్యం చేయాలని కోరారు. అందుకు నిరాకరించిన రాఘవేంద్రచారి హైదరాబాద్‌కు రాలేనని మీరే తిరుగండ్లపల్లికి రమ్మని చెప్పాడు. దీంతో నిందితులు హత్య చేయడానికి ముందు రోజు గ్రామంలో రెక్కి నిర్వహించారు. 2013 జూలై 2వ తేదీన రాఘవేంద్రచారిని కలిసారు. గ్రామ శివారు లో ఉన్న బ్రహ్మదేవుని గుడి వద్ద వైద్యం చేస్తానని రాఘవేంద్రచారి వారిని అక్కడికి తీసుకువెళ్లాడు. దీంతో సాయి, ఠాగూర్, సంతోష్‌లు కలిసి రాఘవేంద్రచారి గొంతునులిమి హత్య చేశారు. అప్పట్లో మృతుడి తండ్రి జంగయ్య ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసుకుని నాంపల్లి సీఐ శివరాంరెడ్డి, చింతపల్లి ఎస్‌ఐ ధనంజయ్య దర్యాప్తు ప్రారంభించారు.
సెల్‌ఫోన్ ఆధారంగా..
రాఘవేంద్రచారిని హత్య చేసిన నింది తులు అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను తమ వెంట తీసుకువెళ్లారు. రాఘవేంద్రచారి హత్యకు గురవడానికి ముందు రోజుల్లో ఎవరెవరు కాల్స్ చేశారు. ప్రస్తు తం ఆ సెల్‌ఫోన్ ఎవరి దగ్గర ఉందనే కోణంలో విచారణ జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ చెప్పా రు. ధనలక్ష్మి, ఆమె రెండో భర్త సంతోష్, అతని స్నేహితుడు ఠాగూర్‌లను హైదరాబాద్‌లో అరెస్టు చేసి వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మరో నిందితుడు సాయి పరారీలో ఉన్నట్లు తెలిపారు. అరె స్టు చేసిన నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు చెప్పారు. సమావేశంలో ఏఎస్‌ఐ పరశురాం, ఐడీపార్టీ పోలీసులు శేఖర్, షరీఫ్, రాంప్రసాద్, నారాయణ, ఖలీల్, ఆంజనేయులు తది తరులున్నారు. కేసును చేధించిన పోలీసులను డీఎస్పీ సోమశేఖర్ అభినందించారు.
తనకు అడ్డుగా ఉన్నాడని.. భర్తను చంపించిన భార్య
Published Sun, Aug 25 2013 8:10 AM | Last Updated on Fri, Sep 1 2017 10:07 PM
Advertisement
Advertisement