రుణమాఫీపై దిగిరాకుంటే ప్రజా ఉద్యమం: రఘువీరా
రైతులకు, డ్వాక్రా గ్రూపు మహిళలకు, చేనేతలకు ఉన్న రుణాలను మాఫీ చేస్తానంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేయాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం దిగిరాకుంటే ప్రజా ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు.
రుణమాఫీ విషయంలో షరతులు విధిస్తే చూస్తూ ఊరుకోబోమని, చంద్రబాబు తప్పించుకునే ధోరణి అవలంబిస్తున్నారని ఆయన అన్నారు. టీడీపీ సర్కారు తీరుకు నిరసనగా ఆగస్టు 4న మొత్తం సీమాంధ్రలోని 13 జిల్లాల కలెక్టరేట్ల వద్ద కాంగ్రెస్ ధర్నా చేస్తుందన్నారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరిగే నిరసనలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొంటారని ఆయన చెప్పారు.