...ఎన్నికల్లో పోటీ చేస్తా: లోకేష్
పార్టీ ఆదేశిస్తే తాను 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. ప్రస్తుతానికి అలాంటి చర్చ ఏమీ లేదని తెలిపారు.
సిద్దార్థ కళాశాలలో ఆయన ఎన్టీఆర్ మ్యూజియాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పి.నారాయణలతో పాటు ఎంపీ కేశినేని నాని కూడా పాల్గొన్నారు.