ఉద్యమాన్ని విరమించం
Published Thu, Oct 10 2013 3:16 AM | Last Updated on Fri, Sep 1 2017 11:29 PM
రాయచోటి, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచుతామంటూ పాలకులు ప్రకటించేంతవరకు ఉద్యమాన్ని విరమించే ప్రసక్తేలేదని, ఎలాంటి త్యాగాలకైనా తాము సిద్ధమేనని సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక జెఏసి నేతలు వెంకటేశ్వరరెడ్డి, రామమోహన్, యహియాబాష, మనో హర్‌రాజు, సి.బి.మనోహర్‌రెడ్డి, బి.వి.రమణలు ప్రకటించారు. బుధవారం స్థానిక ఆర్టీసీ బస్టాండు ఆవరణంలో స్థానిక ఏరియా ఆసుపత్రి ఉద్యోగులు, సిబ్బంది రిలేదీక్షలను చేపట్టారు. వీరికి సంఘీభావం తెల్పిన జేఏసీనేతలు మాట్లాడుతూ సమైక్య రాష్ట్రపరిరక్షణ కోసం ఉపాధ్యాయ, ఉద్యోగులు, ఎన్‌జిఓలు,ఆర్టీసీ కార్మికులు ఉద్యమిస్తుండడం ఎంతైనా అభినందనీయమన్నారు. రాష్ట్రవిభజనను తీవ్రస్థాయిలో వ్యతిరేకించి అడ్డుకోవాల్సిన అన్నిపార్టీల నేతలు నిమ్మకు నీరెత్తినట్లు మిన్నకుండి పోవడం దారుణమన్నారు. ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన నేతలకు ప్రజాభీష్టం మేరకు తప్పక నడుచుకోవాల్సి వుందన్నారు.
పురవీధులలో ర్యాలీ : స్థానిక ఆర్టీసీ బస్టాండులోని రిలేదీక్షల శిబిరం నుండి సమైక్యవాదులు రాష్ట్రవిభజనను నిరసిస్తూ పురవీధులలో నిరసన ర్యాలీ ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కేంద్ర-రాష్ట్రమంత్రులు బొత్ససత్యనారాయణ, రఘువీరారెడ్డి, ఆనం రామనారా యణరెడ్డి, చిరంజీవి, పల్లంరాజు, కోట్ల, పురందేశ్వరి, పనబాక లక్ష్మి తదితరులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంటనే మంత్రులంతా రాజీనామాలు ఆమోదించుకుని ఉద్యమంలో పాల్పంచుకోవాలంటూ డిమాండ్ చేశారు.
వినూత్న నిరసన... రాష్ట్రవిభజనను అడ్డుకోలేని సీమాంధ్రకు చెందిన అసమర్థ కేంద్ర-రాష్ట్రమంత్రుల చిత్రపటాలపై బుధవారం సమైక్యవాదులు వినూత్నరీతిలో నిరసన తెలిపారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర-రాష్ట్రమంత్రులందరి ఫోటోలను ముద్రి ంచిన బ్యానర్‌ను సమైక్యవాదులు నేతాజి సర్కిల్‌లో జాతీయర హదారిపై పడేసి టమోటాలు, కోడిగ్రుడ్లు, చెప్పులతో కొట్టి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక జెఏసి నేతలు వెంకటేశ్వరరెడ్డి, రామమో హన్, పుల్లయ్య, ఖాజామియా, మనోహర్‌రాజు, శేఖరనాయక్, తిప్పారెడ్డి, గంగిరెడ్డి, శివారెడ్డితో పాటు పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయులు, ఆర్టీసి జెఏసి సభ్యులు, నేతలు పాల్గొన్నారు.
బ్యాంకులను మూసివేత...
సమైక్యరాష్ట్ర పరిరక్షణవేదిక రాష్ట్రనేతల పిలుపుమేరకు బుధవారం పట్టణంలో సమైక్యవాదులు రెండవరోజు కూడా కేంద్రప్రభు త్వ కార్యాలయాలు, సంస్థలను మూయించేశారు. పట్టణంలోని ఆంధ్రబ్యాంకు, ఎపిజిబి, హెచ్‌డిఎఫ్‌సి, కార్పొరేషన్ బ్యాంకు, యాక్సిస్‌బ్యాంకు, సిండికేట్, స్టేట్‌బ్యాంకుల వద్దకెళ్ళి వాటిని మూయించారు. అలాగే పోస్టాపీసు, ఎల్‌ఐసి కార్యాలయం, ముత్తూట్ ఫైనాన్స్ తదితర సంస్థలను కూడా మూయించేశారు.
విఆర్‌ఓల దీక్షలు : తహశీల్దార్ కార్యాలయం వద్ద సమైక్యాంధ్ర జెఏసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షాశిబిరంలో బుధవారం మండలంలోని పలు గ్రామాల విఆర్‌ఓలు దీక్షలు చేపట్టారు. వీరికి జెఏసి నేతలు నాగిరెడ్డి,జనార్దన్, శ్రీనివాసరాజు, నాగేశం, ఉపాధ్యాయసంఘం నేతలు వెంకట్రామిరెడ్డి, రెడ్డెన్న,శివారెడ్డి,రాజారమేష్,జాబీర్‌ల తో పాటు ఉపాధ్యాయులు నరసింహారెడ్డి,శ్రీనివాసులు,రెడ్డెప్పరెడ్డి,సునీర్, నాగయ్య, వెంకట్రామరాజు సంఘీభావం తెలిపారు.
కొనసాగిన న్యాయవాదుల దీక్షలు : స్థానిక కోర్డుసముదాయంలో గత 64 రోజులుగా న్యాయవాదులు చేపడుతున్న రిలేదీక్షలను బుధవారం కూడా కొనసాగించా రు. దీక్షలలో న్యాయవాదులు శ్రీనివాసులు, నరసింహారెడ్డి, వి.సి.రెడ్డెప్పరెడ్డి, కోర్టుఉద్యోగి ఖాదర్‌వలీ తదితరులు వున్నారు. వీరికి పలువురు సీనియర్,జూనియర్ న్యాయవాదులు, ఉద్యోగులు సంఘీభావం తెలిపారు.
Advertisement
Advertisement