కృష్ణాజిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. వివాహితపై సామూహిక అత్యాచారం చేసి అనంతరం ఆమెను హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చారు. ఈనెల 12న స్వర్ణలత అనే మహిళను మచిలీపట్నం శివారలో దుండగులు బలవంతంగా ఆటోలో తీసుకు వెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు శ్రీనివాస్, మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
స్వర్ణలతకు ప్రధాన నిందితుడు శ్రీనివాస్తో ఇంతకుముందే పరిచయం ఉందని, పెళ్లికి ముందే వీళ్లు ఆమెకు తెలుసని పోలీసులు చెప్పారు. అప్పుడప్పుడు అతడికి ఆమె డబ్బులు సర్దుబాటు చేసేవారని, మూడేళ్ల క్రితం ఆమెకు విశాఖపట్నానికి చెందిన యువకుడితో పెళ్లయ్యి, ఒక కొడుకు కూడా ఉన్నాడని తెలిపారు. సెలవల్లో గడిపేందుకు కొడుకుతో సహా వచ్చిన స్వర్ణలతను శ్రీనివాస్ మరోసారి డబ్బులు అడిగాడు. కొడుకుతో సహా ఆమెను ఆటోలో మచిలీపట్నం శివారు ప్రాంతాలకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె నగలు తీసుకున్న తర్వాత.. శ్రీనివాస్, అతడితో పాటు ఉన్న మరో ఇద్దరు ఆమెపై అత్యాచారం చేశారు. విషయం బయటకు తెలిస్తే సమస్య అవుతుందని భావించి చంపేశారు. తర్వాత ఆమె కొడుకును తీసుకెళ్లి మచిలీపట్నంలో వదిలేశారు. స్వర్ణలత ఎంతకీ కనపడకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేసి గాలించగా, విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
వివాహితపై సామూహిక అత్యాచారం, హత్య
Published Fri, Jun 20 2014 3:12 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
Advertisement