మానవత్వం మరిచిన మహిళ
తొమ్మిదేళ్ల బాలికపై కిరాతకం
ఇంట్లో చాకిరీ చేయించుకొని కర్రతో దాడి
మల్కాపురం: బాలికతో ఇంటి పని చేయించింది ఓ మహిళ. అంతటితో ఆ గక ఆ చిన్నారిపై విరుచుకుపడి కర్రతో గాయపరి చింది. బాలిక బాధ చూడలేక స్థానికులు కలుగచేసుకోవడంతో వ్యవహారం పోలీసుల వరకు వె ళ్లింది. వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్ రాష్ట్రాని కి చెందిన నేవీ ఉద్యోగి మనోజ్‌కుమార్, అంజలి దంపతులు తమ రెండేళ్ల పాపతో మల్కాపురం సమీపాన ఇందిరాకాలనీలో నివాసముంటున్నా రు. మనోజ్ ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలకు తరచు క్యాంప్‌లు వెళ్తుంటాడు. అంజలి తన పాపను చూసుకునేందుకు, ఇంటి పని కోసం ఏడాది క్రితం గీత అనే తొమ్మిదేళ్ల బాలికను బీహార్ నుంచి తీసుకువచ్చిందని తెలిసింది. శుక్రవా రం గీత సరిగా పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంజలి పలుమా ర్లు కర్రతో కొట్టి, చేతులు, కాళ్లపై తీవ్రంగా గాయపరిచినట్టు స్థానికులు తెలి పారు. పాప కేకలు వెయ్యడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.
గాయాలతో ఉన్న గీతను ఐఎన్‌ఎస్ కళ్యాణి ఆసుపత్రికి తరలించి, పోలీ సులు అంజలిని ప్రశ్నించగా.. ఆ పాపకు గాయాలెలా అయ్యాయో తెలియద ని వాదించింది. అంజలి రోజూ పాపతో క్రూరంగా వ్యవహరిస్తోందని, గతం లో ఇదే మాదిరిగా ఓ చిన్నారిని పనికి తీసుకువచ్చి దాడి చేసిందని స్థానికులు చెప్పారు. ఇదిలా ఉంటే తొమ్మిదేళ్ల పిల్లను ఇంట్లో పనికి పెట్టుకోవడం తప్పు కదా అని ప్రశ్నించేందుకు వెళ్లిన పోలీసులతో అంజలి దురుసుగా ప్రవర్తిం చింది. స్థానికుల ఫిర్యాదు మేరకు సీఐ రంగనాథ్ కేసు నమోదు చేశారు.