భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త | Woman Killed By Husband at Gangireddy palli in Guntur district | Sakshi
Sakshi News home page

భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Published Thu, Nov 28 2013 11:36 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

Woman Killed By Husband at Gangireddy palli in Guntur district

మద్యం తాగేందుకు పైకం ఇవ్వమని కట్టుకున్న భార్యను తాగుబోత్తు భర్త గద్దించాడు. అందుకు ఆ ఇల్లాలు నిరాకరించింది. అప్పటికే మైకంలో ఉన్న భర్త గొడ్డలితో భార్యపై దాడి చేశాడు. ఆ ఘటనతో భయపడిన ఆ ఇల్లాలు నడివీధిలోని పరుగు తీసింది. అయిన భర్త ఆమెను వదలలేదు. నడి రోడ్డుపై గొడ్డలితో భార్యను నరికి చంపేశాడు.

 

ఆ దుర్ఘటన వెల్దుర్తి మండలం గంగిరెడ్డిపల్లెలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. అయితే తాగుబోతును అడ్డుకునేందుకు స్థానికులు యత్నించారు. కానీ అతడు ఆగ్రహంతో ఉండటంతో ఎవరు అందుకు సాహసించలేదు.స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కాగా పోలీసులు ఇంకా సంఘటన స్థలానికి చేరుకోలేదని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement