
మహిళపై యువకుడు అత్యాచారం.. పరారీ
నల్లగొండ జిల్లాలోని కోదాడ మండలం గోండ్రియాలలో ఓ మహిళపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
నల్లగొండ: కీచకుల పరంపర కొనసాగుతోంది. మహిళలపై అకృత్యాలకు అదుపు లేకుండా పోతోంది. అత్యాచారాలకు పాల్పడితే కఠిన శిక్షలు అమలు చేస్తామని ఒకవైపు ప్రభుత్వం హెచ్చరిస్తున్న ఈ ఘటనలు ఆగడం లేదు. తాజాగా నల్లగొండ జిల్లాలోని కోదాడ మండలం గోండ్రియాలలో ఓ మహిళపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాధితురాలు శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.