అనపర్తి, తూర్పు గోదావరి జిల్లా : తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కాలువ లోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న రాజమండ్రికి చెందిన నాగమణి అనే మహిళ మృతి చెందారు. ఈ ఘటనలో 14మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సు కాకినాడ నుంచి రాజమండ్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment