'చంద్రబాబుకు మహిళలు గుణపాఠం చెబుతారు'
'చంద్రబాబుకు మహిళలు గుణపాఠం చెబుతారు'
Published Fri, Aug 1 2014 6:53 PM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కే పరిమితమైన చంద్రబాబు పల్లె బాట పడితే రైతులు, మహిళలు తగిన గుణపాఠం చెబుతారని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.
ఎన్నికల ప్రచారంలో రైతులకు 9 గంటల విద్యుత్ ఇస్తానని చేసిన వాగ్గానం తుంగలో తొక్కారని ఆయన విమర్శించారు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన ఆయన రైతులకు కనీసం 4 గంటల విద్యుత్ కూడా ఇవ్వడం లేదని పెద్దిరెడ్డి ఆరోపించారు. వర్షాలు లేక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. వేరుశనగ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement