మహిళ దారుణ హత్య | women murdered in ysr kadapa district | Sakshi
Sakshi News home page

మహిళ దారుణ హత్య

Dec 10 2015 11:04 AM | Updated on Jul 30 2018 8:29 PM

ఇంట్లో నిద్రిస్తున్న మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లెలో చోటుచేసుకుంది.

వేంపల్లె: ఇంట్లో నిద్రిస్తున్న మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లెలో చోటుచేసుకుంది.  స్థానిక గరుగు వీధిలో నివాసముంటున్న పూలకుంట తులసి(44) వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటుంది. గురువారం ఉదయం ఆమె కూతురు ఇంటికి వచ్చి చూసేసరికి  తులసి రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో ఆమె పోలీసులకు సమాచారం అందించింది.
 
సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యాపారంలో గొడవల ఏమైనా హత్యకు కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యలనడిగి వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement