కృష్ణా జిల్లా పెడన పట్టణంలో ఓ నవ వధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
విజయవాడ : కృష్ణా జిల్లా పెడన పట్టణంలో ఓ నవ వధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన గురువారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు... పెడన పట్టణానికి చెందిన ప్రకాశ్‌రావు కూతురు ధనలక్ష్మి(19)కి వివాహం ఈ నెల 11న జరిగింది. అయితే బుధవారం రాత్రి ధనలక్ష్మిగుండెపోటుతో మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. అయితే దనలక్ష్మీ అనుమాస్పద స్థితిలో మరణించినట్టు ఆమె బందువులు ఆరోపించారు. కాగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
(పెనుగంచిప్రోలు)