నెల్లూరు: పెళ్లయిన నాలుగు నెలలకే ఓ వివాహిత అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. ఈ ఘటన నెల్లూరు నగరంలోని బోడిగారితోటలో సోమవారం ఉదయం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కె.ప్రమీల (25), ఆటో డ్రైవర్‌గా పనిచేసే విశ్వనాథం నాలుగు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, స్థానిక బోడివారితోటలో తాము నివాసం ఉండే ఇంట్లో సోమవారం తెల్లవారుజామున ప్రమీల మృతి చెందింది.
ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అయితే ప్రమీల మృతి చెందిన సమయంలో భర్త విశ్వనాథం కూడా ఇంట్లోనే ఉండడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భర్తే తమ కూతుర్ని చంపినట్టు ప్రమీల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.