మహిళలు, నిరుద్యోగులతో కిక్కిరిసిపోయింది. ఈ ధర్నాను విజయవంతం చేయడానికి పార్టీ కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు జిల్లా నలుమూలల నుంచి కదిలివచ్చారు. పోలీసులు సభా ప్రాంగణంలో కార్యకర్తలను అడ్డుకోవాలని ప్రయత్నించినా వారు సంయమనం పాటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ ధర్నా మధ్యాహ్నం 2 గంటల వరకు సాగింది. చంద్రబాబు చేసిన మోసంతో ‘కడుపు మండుతోంది. గుండెలు అవిసిపోయాయి. కలలు కల్లలయ్యాయి. బతుకు మరింత దుర్భరమైంది. ఎన్నో హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం మమ్మల్ని మరిన్ని బాధల్లోకి నెట్టింది. ఎన్నికల వాగ్దానాలు అమలు అవుతాయని ఎదురుచూసిన మాకు కన్నీళ్లే మిగిలాయి.’ అంటూ మహాధర్నాలో పాల్గొన్న ఆదోని డివిజన్‌కు చెందిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కనిపించారు.
‘రుణాలను మాఫీ చేస్తామని నమ్మబలికిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఎన్నో మెలికలు పెట్టారు. ఇప్పుడు రూ. 50 వేలలోపు రుణాలకే మాఫీ వర్తిస్తుందంటున్నారు. పింఛన్ సొమ్మును పెంచినట్టే పెంచి అర్హులను సైతం నట్టేట ముంచారు. దగా బాబు.. మమ్మల్ని దగా చేశారు.’ అంటూ వృద్ధులు, రైతులు మండిపడ్డారు. ‘డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్న చంద్రబాబు మాటలు నమ్మి.. అసలు కట్టకపోవడంతో.. ఇప్పుడు పొదుపు చేసుకున్న సొమ్ము బ్యాంకర్లు జమ చేసుకున్నారు. వడ్డీ కూడా కట్టాలని హెచ్చరిస్తున్నారు.
చంద్రబాబు ఇంత మోసం చేస్తాడనుకోలేదు’ అని ఆత్మకూరుకు చెందిన పలు పొదుపు సంఘాల మహిళా సభ్యులు ఎమ్మెల్యేల వద్ద వాపోయారు. చాలా మంది వృద్ధులు తమ పేర్లను అన్యాయంగా పింఛన్ జాబితా నుంచి తొలగించారని, మీరే న్యాయం చేయాలంటూ.. సభలో ఎమ్మెల్యేలను వేడుకోవడం కనిపించింది. చంద్రబాబు అమలు కాని హామీలతో రైతుల్ని, డ్వాక్రా సంఘాల్ని నట్టేట ముంచారని, నిరుద్యోలకు భృతి అంటూ నమ్మబలికి ఓట్లు దండుకున్నారని ఎమ్మెల్యేలు చెప్పిన సందర్భాల్లో ‘అవును.. అవును.. మోసపోయాం’ అని శాపనార్థాలు పెట్టారు.
చంద్రబాబు రూ. 50 వేల లోపు రుణాలను మాఫీ చేస్తామంటూ గురువారం ప్రకటిస్తే జిల్లా నేతలు కర్నూలు నగరంలో లడ్డూలు పంచుకోవడం సిగ్గుచేటని, దమ్ముంటే సంబరాలు చేయడానికి పల్లెలకు వెళ్లాలని చెబుతున్న సందర్భంలో ‘పల్లెలకు వస్తే తెలుగుదేశం నేతల్ని తరిమితరిమి కొడతాం’ అంటూ గట్టిగా హెచ్చరించడం ధర్నా ప్రాంగణంలో కనిపించింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డికి నాగలక్ష్మమ్మ అనే వికలాంగ వృద్ధురాలు ప్రభుత్వం పింఛను తీసివేసిన తీరును వివరిస్తున్న సందర్భంలో ధర్నాకు హాజరైన చాలా మంది వృద్ధ మహిళలు భావోద్వేగానికి గురవడం కనిపించింది. కొందరు మహిళలు కంట తడిపెట్టుకోవడం చూసి అందరూ చలించిపోయారు. డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రసంగాన్ని ప్రజలు ఆసక్తిగా వినడం కనిపించింది. భూమా అఖిలప్రియ ప్రసంగిస్తున్నంత సేపు శోభమ్మా.. శోభమ్మా అంటూ చప్పట్లు మారుమోగాయి. ఎస్వీ మోహన్‌రెడ్డి చంద్రబాబును నక్కజిత్తుల చీటింగ్ బాబూ అని ఉద్దేశించి చెప్పిన సందర్భంలోనూ ‘అవును.. అవును’ రైతుల నుంచి సమాధానం రావడం కనిపించింది.
జన హోరు
Published Sat, Dec 6 2014 2:54 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
Advertisement