మహబూబ్‌నగర్ అర్బన్, న్యూస్‌లైన్: హైదరాబాద్ నుంచి ఇడుపులపాయకు బయలుదేరిన వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పాలమూరు ప్రజలు అపూర్వస్వాగతం పలికారు. సోమవారం రాత్రి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో తమ అభిమాననేత వస్తున్నారని తెలిసి పార్టీ నేతలు, కార్యకర్తలు సాయంత్రం ఏడు గంటల నుంచే ఆయా రైల్వేస్టేషన్ల వద్ద ఆయన రాకకోసం నిరీక్షించారు. 16 నెలలుగా నేరుగా చూడలేకపోయిన యువనేత దర్శనమివ్వడంతో పార్టీశ్రేణుల్లో ఉత్పాహం పెల్లుబికింది. ఆయన కనిపించంతోనే జగన్నినాదంతో రైల్వేస్టేషన్లు మార్మోగాయి.
జిల్లాలోని షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల, అలంపూర్ తదితర ప్రాంతాల్లో రైలు బోగీలో నుంచి ప్రజలకు అభివాదం చేసి వారిపట్ల తనకున్న ఆప్యాయత, అనురాగాన్ని వ్యక్తంచేశారు. జిల్లాకేంద్రం పాలమూరు పట్టణంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాక కోసం పార్టీ నాయకులతో పాటు సామాన్య ప్రజలు సైతం భారీగా తరలొచ్చి అన్నకు అపూర్వస్వాగతం పలికారు. రాత్రి 10.35 గంటలకు మహబూబ్‌నగర్ చేరుకున్న ఆయనకు పలువురు నేతలు పుష్పగుచ్ఛాలు అందజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
‘జై జగన్, వచ్చాడు.. వచ్చాడు పులిబిడ్డ వచ్చాడు’ అంటూ చేసిన నినాదాలు.. కేరింతలతో రైల్వేస్టేషన్ దద్దరిల్లింది. హైదారాబాద్ నుంచి అదేరైలులో వచ్చిన ప్రయాణికులు జగన్నను చూసేందుకు పోటీపడ్డారు. కార్యక్రమంలో పార్టీ యువజన, మైనార్టీ విభాగాల జిల్లా కన్వీనర్లు ఆర్.రవిప్రకాశ్, సయ్యద్ సిరాజుద్దీన్, మాజీ కౌన్సిలర్ అంతయ్య, నాయకులు మహ్మద్ వాజిద్, రాశెద్ ఖాన్, సర్దార్, ఆర్టీసీ కార్మికనేత జహంగీర్, ఎస్ .వెంకట్‌రెడ్డి, కురుమూర్తి, జోగులు, పీటర్, అంజాద్ అలీ, ముజాహిద్, నసీర్, బషీర్, షబ్బీర్, మిట్టమీది నాగరాజు, తిరుపతి నాయక్ తదితరులు ఉన్నారు.
జననేతకు ఘనస్వాగతం
Published Tue, Oct 1 2013 3:40 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement