వైఎస్ జగన్ జుడిషియల్ కస్టడీ ఆగస్టు 26కు పొడిగింపు
ఆస్తుల కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జుడిషియల్ కస్టడీ ఆగస్టు 26కు సీబీఐ ప్రత్యేక కోర్టు పొడిగించింది. ఈ కేసులో విజయ సాయి రెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ రావు, పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్, అధికారులు కేవి బ్రహ్మనంద రెడ్డిలను చంచల్ గూడలోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. జగన్ ఆస్తుల కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాద రావులు కూడా విచారణకు హాజరయ్యారు.
ఓబులా పురం కేసులో కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిలతోపాటు ఇతరులకు కూడ ఆగస్టు 26 తేదికి కస్టడీకి పొడిగించారు. ఆనారోగ్య కారణాలతో సస్పెన్షన్ గురైన ఐఏఎస్ అధికారి శ్రీలక్షి విచారణకు హాజరుకాలేదు.