మృత్యు శకటం | YALAMANCHILI National Highway in accident | Sakshi
Sakshi News home page

మృత్యు శకటం

Published Mon, Feb 15 2016 1:49 AM | Last Updated on Sun, Sep 3 2017 5:39 PM

మృత్యు శకటం

మృత్యు శకటం

యలమంచిలి జాతీయ రహదారిపై ఆదివారం మృత్యు ఘంటికలు మోగాయి. రహదారి నెత్తురోడటంతో రథసప్తమి శోక సప్తమిగా మారిపోయింది.   హైదరాబాద్ నుంచి మృతదేహాన్ని  ఒరిస్సా రాష్ట్రానికి అంబులెన్స్‌లో తీసుకెళుతున్న ఓ కుటుంబాన్ని మృత్యువు  వెంబడించి పొట్టనపెట్టుకుంది.   ఈ సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురితో పాటు డ్రైవర్ దుర్మణం పాలయ్యారు.     హృదయ విదారకమైన ఈ సంఘటన చూసినవారు నిశ్చేష్టులయ్యారు.  యలమంచిలి: ఒరిస్సా రాష్ట్రం బాలేశ్వర్‌కు చెందిన నిరంజన్‌గిరి హైదరాబాద్‌లో మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించాడు. అంత్యక్రియలు జరిపించేందుకు మృతదేహాన్ని తీసుకొని కుటుంబ సభ్యులు  అంబులెన్స్‌లో స్వస్థలానికి బయలుదేరారు.   మార్గమధ్యంలో వీరు ప్రయాణిస్తున్న అంబులెన్స్  ప్రమాదానికి గురైంది. యలమంచిలి సమీపంలో ఎర్రవరం కల్వర్టు వద్ద  అదుపుతప్పి కాల్వలోకి దూసుకుపోయి బలంగా తాటిచెట్టును ఢీకొట్టింది. అంబులెన్స్‌లో మృతదేహంతో పాటు మృతుని భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె, కోడలు, మనుమడు, మనుమరాళ్లు, ఇద్దరు డ్రైవర్లు మొత్త పది మంది ఉన్నారు.   వీరిలో నిరంజన్‌గిరి భార్య పవిత్రాగిరి, కుమారుడు రవికుమార్, కుమార్తె మణితి, ఏడాదిన్నర మనుమడు జాగా,   అంబులెన్స్ డ్రైవర్ వెంకటరమణ దుర్మరణ చెందారు.  నిరంజన్‌గిరి కోడలు స్వర్ణలత, మరో కుమారుడు సీతారాం, మనుమరాళ్లు మమత, నమత,   రెండో డ్రైవర్ శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న ఈ కుటుంబాన్ని మృత్యువు వెంబడించి  కబళించింది. అభంశుభం తెలియని పసిబాలుడిని కూడా పొట్టన పెట్టుకోవడం చూపరులను కంటతడిపెట్టించింది.

 రహదారి నెత్తురోడటంతో రథసప్తమి శోక సప్తమిగా మారిపోయింది.   హైదరాబాద్ నుంచి మృతదేహాన్ని  ఒరిస్సా రాష్ట్రానికి అంబులెన్స్‌లో తీసుకెళుతున్న ఓ కుటుంబాన్ని మృత్యువు  వెంబడించి పొట్టనపెట్టుకుంది.   ఈ సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురితో పాటు డ్రైవర్ దుర్మణం పాలయ్యారు.     హృదయ విదారకమైన ఈ సంఘటన చూసినవారు నిశ్చేష్టులయ్యారు.  యలమంచిలి: ఒరిస్సా రాష్ట్రం బాలేశ్వర్‌కు చెందిన నిరంజన్‌గిరి హైదరాబాద్‌లో మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించాడు. అంత్యక్రియలు జరిపించేందుకు మృతదేహాన్ని తీసుకొని కుటుంబ సభ్యులు  అంబులెన్స్‌లో స్వస్థలానికి బయలుదేరారు. 

మార్గమధ్యంలో వీరు ప్రయాణిస్తున్న అంబులెన్స్  ప్రమాదానికి గురైంది. యలమంచిలి సమీపంలో ఎర్రవరం కల్వర్టు వద్ద  అదుపుతప్పి కాల్వలోకి దూసుకుపోయి బలంగా తాటిచెట్టును ఢీకొట్టింది. అంబులెన్స్‌లో మృతదేహంతో పాటు మృతుని భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె, కోడలు, మనుమడు, మనుమరాళ్లు, ఇద్దరు డ్రైవర్లు మొత్త పది మంది ఉన్నారు.   వీరిలో నిరంజన్‌గిరి భార్య పవిత్రాగిరి, కుమారుడు రవికుమార్, కుమార్తె మణితి, ఏడాదిన్నర మనుమడు జాగా,   అంబులెన్స్ డ్రైవర్ వెంకటరమణ దుర్మరణ చెందారు.  నిరంజన్‌గిరి కోడలు స్వర్ణలత, మరో కుమారుడు సీతారాం, మనుమరాళ్లు మమత, నమత,   రెండో డ్రైవర్ శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న ఈ కుటుంబాన్ని మృత్యువు వెంబడించి  కబళించింది. అభంశుభం తెలియని పసిబాలుడిని కూడా పొట్టన పెట్టుకోవడం చూపరులను కంటతడిపెట్టించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement