విజయసాయిరెడ్డి మే 2వ తేదీ నుంచి పాదయాత్ర | YCP MP Vijaya Sai Reddy Praja Sankalpa Yatra With Solidarity YS Jagan | Sakshi
Sakshi News home page

విజయసాయిరెడ్డి మే 2వ తేదీ నుంచి పాదయాత్ర

Published Sun, Apr 29 2018 12:46 PM | Last Updated on Thu, May 24 2018 2:18 PM

YCP MP Vijaya Sai Reddy Praja Sankalpa Yatra With Solidarity YS Jagan - Sakshi

రాజ్యసభ సభ్యుడు, విజయసాయిరెడ్డి

ఆరిలోవ(విశాఖ తూర్పు) : వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్రకు సంఘీభావంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి జీవీఎంసీ పరిధిలో మే 2వ తేదీ నుంచి పాదయాత్ర చేపట్టనున్నారని ఆ పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్‌ తెలిపారు. ఈ పాదయాత్ర అగనంపూడిలో వైఎస్సార్‌ విగ్రహం వద్ద ప్రారంభంకానుందన్నారు. పెందుర్తి, విశాఖ పశ్చిమ, ఉత్తర, తూర్పు నియోజకవర్గాల మీదుగా దక్షిణ నియోజకవర్గానికి పాదయాత్ర చేరుకుంటుందని చెప్పారు.

ఆయా ప్రాంతాల్లో ప్రజా సమస్యలు తెలుసుకుంటారని తెలిపారు. మే 12న జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. పాదయాత్ర రోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement