
యోగా మన వారసత్వం: సీఎం
విజయవాడ స్పోర్ట్స్: యోగా మన దేశ వారసత్వమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. మనస్సు, శరీరం అనుసంధానం చేసే యోగాను ఆచరించే వారు ఎటువంటి ఫలితాలైనా సాధించగలరని అన్నారు. మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా స్థానిక ఎ–కన్వెన్షన్ సెంటర్‌లో రాష్ట్ర ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జ్యోతి ప్రజల్వన చేసి ప్రారంభించి యోగాసనాలు వేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ యోగా ఔన్నత్యాన్ని చెప్పారు.