ప్రాదేశిక పోరులో యువరక్తం సత్తా చాటనుంది. చాలా మంది 30 ఏళ్లలోపువారే పోటీలో ఉన్నారు. అలాగే విద్యావంతులు రాజకీయంగా తమ భవిష్యత్తును పరీక్షించుకోనున్నారు. బీటెక్, ఎంటెక్ చేసిన వారూ బరిలో ఉన్నారు. సుమారు పాతిక మంది డిగ్రీ చదువుకున్న వారు ఉండగా, మిగిలిన వారిలో మూడో వంతు పదో తరగతి, ఇంటర్ వరకు చదువుకున్న వారున్నారు. 125 మంది వరకూ పది లోపు, 50 మంది వరకు ఐదు కంటే తక్కువ చదువుకున్నవారున్నారు.
సాక్షి, కాకినాడ : జిల్లాలో 57 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 1063 ఎంపీటీసీ స్థానాలకు రెండు విడతల్లో పరిషత్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎంపీటీసీ స్థానాల్లో ఇప్పటికే 23 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 57 జెడ్పీటీసీ స్థానాల కోసం 242 మంది బరిలో ఉండగా, ఎన్నికలు జరిగే 1040 ఎంపీటీసీ స్థానాలకు 2705 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఎంపీటీసీ స్థానా ల్లో బరిలో నిలిచిన వారిలో సుమారు వెయ్యి మందికి పైగా రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వారుండగా, సుమారు 500 మందికిపైగా గతంలో సర్పంచ్‌లు గా, ఎంపీటీసీలుగా పోటీ చేసి ఓటమి పాలైన వారున్నారు. మిగి లిన వారంతా ఈసారి కొత్తగా బరిలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షిం చుకుంటున్నారు. జెడ్పీటీసీ అభ్యర్థుల వరకు చూస్తే 242 మందిలో సుమారు 30 మంది మాత్రమే గతంలో పదవులు చేసిన వారున్నారు. మరో 25 మంది వరకు రాజ కీయ నేపథ్యం కలిగిన కుటుంబాల నుంచి వచ్చిన వారున్నారు.
వీరంతా విద్యావంతులే...
ఆలమూరు మండలం జెడ్పీటీసీ అభ్యర్థిగా ఎంటెక్ చేసి, తణుకు ఏఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తు న్న నాతి అనురాగమయి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా జగ్గంపేట జెడ్పీటీసీ స్థానం నుంచి బరిలోకి దిగిన జ్యోతుల నవీన్‌కుమార్ బీబీఎం చదువుకున్నారు. అలాగే కడియం టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి పాలపర్తి రోజా బీటెక్ పూర్తిచేయగా, రంగంపేట టీడీపీ అభ్యర్థి పెండ్యాల నళినీకాంత్ బీటెక్ మధ్యలో ఆపేశారు.
రావులపాలెం మండలం వెదిరేశ్వరం-2 ఎంపీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా ఎంఏ చదివిన మారే సుబ్బాయ్యమ్మ పోటీ చేస్తున్నారు. మామిడికుదురు మండలం మగటిపల్లికి చెందిన మెహర్ ఉన్నీసామహ్మద్ బీఎస్పీ తరఫున జెడ్పీటీసీగా పోటీ చేస్తున్నారు. ఉన్సీసా ఎంఏ లిటరేచర్ పూర్తి చేసి హిందీ పండిట్‌గా శిక్షణ పొందారు. మారేడు మిల్లి వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గొర్లె అనిల్ ప్రసాద్ ఎంఏ, బీఈడీ చేసి ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతున్నాడు.
రామచంద్రపురం మండలం ద్రాక్షారామ ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా ఎంఏ, బీఈడీ చేసిన యాట్ల రోజారాణి పోటీ చేస్తున్నారు. రాయవరం మండలం వి.సావరం నుంచి వైఎస్సార్ సీపీ తరఫున ఎంపీటీసీ స్థానానికి పోటీ చేస్తున్న కాకర సుప్రియ బీఎస్సీ ఫైనలియర్ పరీక్షలు రాసింది. ఉప్పలగుప్తం నుంచి బరిలోకి దిగిన నలుగురిలో ముగ్గురు న్యాయ పట్టభద్రులే. సఖినేటిపల్లి టీడీపీ అభ్యర్థి ఓగూరి లక్ష్మీరాజ్యం హిందీపండిట్‌గా పనిచేశారు.
స్థానిక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు సోదరుని వియ్యం కుడి భార్య. సుమారు పాతిక మంది వరకు డిగ్రీ చదువుకున్న వారు ఉండగా, మిగిలిన వారిలో మూడో వంతు పదోతరగతి, ఇంటర్ వరకు చదువుకున్న వారున్నారు. ఇక బరిలో నిలిచిన వారిలో సుమారు 125 మంది వరకు పది లోపు చదువుకున్న వారే ఉన్నారు. సుమా రు 50 మంది వరకు ఐదు కంటే తక్కువ చదువుకున్న వారున్నారు.
సంతకాలు మాత్రమే చేసే అభ్యర్థులు
మరో 25 మంది వరకు సంతకాలు మాత్రమే చేయగలిగే విద్యార్హతలు లేని వారు ఉన్నారు. ఇదే రీతిలో ఎంపీటీసీ అభ్యర్థుల్లో సగానికి పైగా పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న వారుండగా, మిగిలిన వారిలో సగానికి పైగా ఐదు నుంచి పదిలోపు చదువుకున్నవా రు ఉన్నారు. ఇలా అనేక ప్రత్యేకతలు ఈసారి జరగబోయే పరిషత్ ఎన్నికల్లో సంతరించుకున్నాయి.
యువ పరిషత్
Published Fri, Apr 4 2014 11:55 PM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement