సాక్షి, బొబ్బిలి: రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 287వ రోజు షెడ్యూల్ ఖరారైంది. జననేత చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో అనంతవాహినిలా సాగిపోతోంది. రాజన్న తనయుడు మంగళవారం ఉదయం బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం లక్ష్మీపురం క్రాస్ నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి బాడంగి, ముగద, చిన్న భీమవరం క్రాస్, పెద్ద భీమవరం వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.
ముగిసిన పాదయాత్ర: వైఎస్ జగన్ 286వ రోజు పాదయాత్ర లక్ష్మీపురం క్రాస్ వద్ద ముగిసింది. నేడు జననేత పాదయాత్ర ఎస్. బూర్జవలస శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి చౌదంతి వలస మీదుగా బొబ్బిలి నియోజకవర్గంలోని బాడంగి మండలం పిండ్రంగి వలస, డొంకిన వలస, పెద్దపల్లి క్రాస్ మీదుగా లక్ష్మీపురం క్రాస్ వరకు ఈ రోజు పాదయాత్ర కొనసాగింది. నేటి ప్రజాసంకల్పయాత్రలో జననేత 9.5 కిలోమీటర్లు నడిచారు. దీంతో ఇప్పటివరకు మొత్తంగా 3,149.6 కిలోమీటర్ల పాదయాత్రను రాజన్న తనయుడు పూర్తిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment