viziayanagaram
-
ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట
-
గిరిపుత్రుల చెంతకు గవర్నర్
సాక్షి విజయనగరం : రాష్ట్ర ప్రధమ పౌరుడు, గవర్నర్ బిశ్వభూషన్ హరి చందన్ తొలిసారి జిల్లా పర్యటనకు వస్తున్నారు. గురువారం ఆయన సాలూరు నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఖరారు కావడంతో అధికారులు పక్కా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ ముఖ్యంగా గిరిజనులతో సమావేశమవుతారు. ప్రభుత్వ పరంగా వారికి అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి చర్చిస్తారు. అధికారులు గిరిజన సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాల గురించి ఆయనకు వివరించేందుకు సిద్ధమయ్యారు. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఒక్కరోజు పర్యటన నిమిత్తం గురువారం జిల్లాకు వస్తున్నారు. విశాఖపట్నం నుంచి నేరుగా సాలూరుకు హెలీక్యాఫ్టర్‌లో వస్తున్న ఆయన అక్కడ గర్భిణుల కోసం ఏర్పాటు చేసిన వసతిగృహానికి వెళ్లి వారితో మాట్లాడుతారు. అక్కడి నుంచి అమ్మవలస వెళ్లి గిరిజనులు సాగు చేస్తున్న పంటల గురించి తెలుసుకుని అక్కడి వారితో ముఖాముఖి అవుతారు. అనంతరం పి.కోనవలస ఆశ్రమ పాఠశాలలో జూనియర్ కాలేజీ విద్యార్థులతో మాట్లాడుతారు. అనంతరం ఆయన విశాఖపట్నం వెళతారు. ఈ పర్యటనలో ఆయన పూర్తిగా గిరిజనులకు ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. గవర్నర్ పర్యటనకు సంబంధించి అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఆయన పర్యటనలో భాగంగా హెలీప్యాడ్ మొదలుకుని ఆయన పర్యటించే ప్రాంతాల్లో పక్కాగా అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గిరిజనులతో మాటాడేందుకు ఏర్పాటు చేయడమే గాకుండా... గిరిజనులను కూడా ఇందుకోసం సిద్ధం చేశారు. ప్రభుత్వపరంగా అమలవుతున్న కార్యక్రమాలు వివరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దేశంలో మరెక్కడా లేని విధంగా సాలూరులో ఏర్పాటైన గర్భిణుల వసతి గృహాన్ని మొదటి గా గవర్నర్ సందర్శించనున్నారు. ప్రత్యేకించి గర్భిణుల కోసం ఇక్కడ గతేడాది అప్పటి ఐటీడీఏ పీఓ లక్ష్మీశ ఈ వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. కొండప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు సరైన పోషకాహారం అందకపోవడం, వైద్య సదుపాయాలు లేకపోవడం వంటి సమస్యలున్నాయి. ఈ అంశాలపై అప్పట్లో ‘సాక్షి’ దినపత్రిక కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలో పీఓ వసతిగృహాన్ని ఏర్పాటు చేసి గర్భిణులకు సౌకర్యం కల్పించారు. ఇప్పటివరకు ఇక్కడ సుమారు 300మంది గర్భిణులు ఇక్కడ ఆశ్రయం పొందారు. ప్రస్తుతం 28మంది గిరిజన మహిళలు ఇక్కడ ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వారికి అందుతున్న సదుపాయాలు, ప్రభుత్వ లక్ష్యం తదితర విషయాల గురించి గవర్నర్ తెలుసుకోనున్నారు. అమ్మవలసలో గిరిజన రైతులతో ముఖాముఖి :ఇదిలాఉండగా తదుపరి పర్యటనలో ఆయన అమ్మవలస గ్రామంలో గిరిజనులు పంటలు పండించే విధానం గురించి తెలుసుకుంటారు. అక్కడి గిరిజనులు పత్తి పంట ద్వారా లాభాలు పొందుతున్నారు. పత్తితోపాటు అంతర్పంటలు సాగు చేస్తున్నారు. ఈ విషయాల గురించి తెలుసుకుని తర్వాత గిరిజనులతో పంటలతోపాటు ఇతర అంశాలపై మాట్లాడుతారు. అనంతరం గవర్నర్ పి.కోనవలస గిరిజన సంక్షేమ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో పలు అంశాలపై చర్చిస్తారు. ఈ నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. ఆయన వచ్చి వెళ్లేందుకు, గిరిజనులతో మాట్లేందుకు, పంటలు పరిశీలించేందుకు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ఎం. హరి జవహర్లాల్, ఐటీడీఏ పీఓ బి.ఆర్.అంబేడ్కర్ బుధవారం మరోసారి పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకున్నారు. గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
బోగస్‌కు ఇక శుభం కార్డు !
బోగస్ కార్డుల అసలు రంగు తేలిపోనుంది. దర్జాగా అనుభవిస్తున్నవారి బండారం బయటపడనుంది. వేలకువేలు జీతాలు తీసుకుంటున్నా... ఇంకా నిరుపేదలకు అందించే సౌకర్యాలకోసం వెంపర్లాడేవారికి గుణపాఠం కలగనుంది. డీలర్ల వ్యవస్థలో గుట్టుగా సాగిపోయిన ఈ వ్యవహారానికి ఇక చెక్‌పడనుంది. ఆధార్ కార్డుల అనుసంధానంతో ఈ రహస్యం కాస్తా బట్టబయలవుతోంది. కొందరు ఉద్యోగుల కుటుంబీకులు తాము అర్హులమేననీ... తమ పిల్లలకు ఉద్యోగం ఉన్నంతమాత్రాన తామెలా అనర్హులమని విన్నవించుకోవడంతో సర్వేకు సన్నాహాలు మొదలయ్యాయి. సాక్షి, విజయనగరం: ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ... వేలాది రూపాయల వేతనం తీసుకుంటున్న వారిలో చాలా మంది దారిద్య్రరేఖకు దిగువనున్నవారికోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సౌకర్యాలు పొందుతున్నారు. ఈ విషయం ఆధార్ అనుసంధానంతో వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు అధికారులు వారి కార్డులు తొలగించే ప్రక్రియ చేపడుతున్నారు. కొందరి కార్డులు ఆగిపోగా... తాము అర్హులమేనని, అయినా తమ కార్డులు తీసేశారని పలువురు వినతులు కూడా ఇవ్వడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని అర్హులను ఎట్టి పరిస్థితుల్లో తొలగించవద్దని అధికారులను ఆదేశించింది. ఇప్పుడు అధికారులు విచారణ చేపట్టి నిజమైన ఉద్యోగులెవరో తేల్చాలన్న నిర్ణయానికి వచ్చారు. అంతవరకు రేషన్ సరుకుల సరఫరా కొనసాగించాలని నిర్ణయించారు. ఉద్యోగుల వద్ద 7,204 కార్డులుప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, ఇతర అవసరాల కోసం తమ ఆధార్ నంబరు లింక్ చేశారు. అంతేగాకుండా ఉద్యోగులకు సంక్రమించే పలు ప్రయోజనాల కోసం వారి కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ నంబర్లు నమోదు చేశారు. ఈ వివరాలను తీసుకున్న పౌరసరఫరాలశాఖ అధికారులు రేషన్‌కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేశారు. ఈ విధంగా రరేషన్కార్డులు కలిగిన ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు గుర్తించారు. జిల్లాలో మొత్తం 7,12,303 రేషన్‌కార్డులు ఉన్నాయి. ఆధార్ అనుసంధానంతో ఇందులో 7,204 రేషన్‌కార్డులు ప్రభుత్వ ఉద్యోగుల వద్ద ఉన్నట్లు గుర్తించారు. వీరందరికీ సెప్టెంబర్ నెలలో రేషన్ ఆపేశారు. రేషన్‌కార్డుల్లో ఉన్న కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగి కార్డుగా గుర్తించారు. అయితే పదేళ్ల కిందట కార్డులు ఇవ్వడంతో ఇందులో కొందరు ఉద్యోగం పొందిన తర్వాత కార్డులు పొందగా కొందరు మాత్రం ఉద్యోగం రాకముందు కార్డులు పొందారు. ఉద్యోగం వచ్చిన తర్వాత వారు కార్డులు రద్దు చేసుకోపోవడం విశేషం. పిల్లలకు ఉద్యోగం రావడంతో తల్లిదండ్రులు కూడా బీపీఎల్ నుంచి బయటకు వస్తారు. కానీ ఉద్యోగం పిల్లలది కాబట్టి తమకు ఉద్యోగం లేదని వాదిస్తున్నారు. ఈ విధంగా ఇందులో అనేకమంది తాము పేదలమేనని, తమకు ఉద్యోగాలు లేవని అధికారులకు విన్నవించారు. కొందరు మాత్రం తప్పుగా ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు కావడంతో కార్డులు ఆగినట్లు సమాచారం. దీంతో వీరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ తమ కార్డులు కొనసాగించాలని వేడుకున్నారు. దీనిపై గందరగోళ పరిస్థితి తలెత్తడంతో వెంటనే ఆపేసిన కార్డులు పునరుద్ధరించి సరుకులు సరఫరా యధాతథంగా కొనసాగించి, తదుపరి చర్యలు మొదలుపెట్టారు. వ్యక్తిగతంగా విచారణ కార్డులన్నింటినీ విచారణ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై ఉన్నతాధికారులు జిల్లా అధి కారులకు ఆదేశాలు జారీ చేసి విచారణ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా సంయుక్త కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి విచారణ చేయాలని మండల పౌరసరఫరాల అధికారులు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఇంటింటికి వెళ్లి వ్యక్తిగతంగా పరిశీలించాలని, అందులో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరో గుర్తించాలని ఆదేశించారు. అంతా కలిసి ఉన్నారా? లేకుంటే వేర్వేరుగా ఉన్నారా? అన్నది విచారించాలని ఉన్నతాధికారులు జారీ చేసిన ఉత్తర్వులు పేర్కొనడంతో ఆ విధంగా ముందుకెళ్లాలని జేసీ సూచించారు. అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత కార్డుకు అర్హులవునో కాదో తేల్చాలి. ఈ మేరకు సర్వే ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు ఇంటిస్థలాలకు లబ్ధిదారులు, స్థలాల గుర్తింపు పనిలో బిజీగా ఉన్నారు. దీనికితోడు ఎన్నికలు, ఇతర విధులు ఉన్నాయి. ఇళ్ల స్థలాలు పూర్తయిన తర్వాత రేషన్‌కార్డులపై దృష్టి పెడతారని సమాచారం. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఇప్పటికే గుర్తించిన ప్రభుత్వ ఉద్యోగుల కార్డుల్లో ఎన్ని బోగస్‌వి ఉన్నా యో తేలిపోతుంది. అందులో తెల్లదొరలు బయటకు వస్తారు. విచారణ జరగాల్సి ఉంది ప్రభుత్వ ఉద్యోగులుగా భావంచి ఆపేసిన తెల్లకార్డులను పదిరోజుల్లోనే పునరుద్ధరించాం. సరుకులు ఇస్తున్నాం. కానీ ఇందులో బోగస్ ఎన్ని అన్నది ప్రతి ఇంటికి వెళ్లి విచారించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇంకా విచారణ జరగాల్సి ఉంది. అందులో అనర్హులని తేలితే కార్డులు ఆపేస్తారు. – ఎ. పాపారావు, డీఎస్ఓ, విజయనగరం -
289వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, బొబ్బిలి: రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 289వ రోజు షెడ్యూల్ ఖరారైంది. జననేత చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో అనంతవాహినిలా సాగిపోతోంది. రాజన్న తనయుడు శనివారం ఉదయం బొబ్బిలి మండలంలో ఇందిరమ్మ కాలనీ, పొలవాని వలస, మెట్టల వలస మీదుగా పాదయాత్రను చేపడతారు. మధ్యాహ్న భోజన సమయం తరువాత భోజరాజ పురం, సీతారామపురం, పారాడి వరకు జననేత పాదయాత్రను కొనసాగిస్తారు. ఈ మేరకు వైఎస్సార్సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. -
288వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, బొబ్బిలి: రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 288వ రోజు షెడ్యూల్ ఖరారైంది. జననేత చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో అనంతవాహినిలా సాగిపోతోంది. రాజన్న తనయుడు బుధవారం ఉదయం బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం పెద్ద భీమవరం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి జె.రంగరాయపురం, రంగరాయపురం, అప్పయ్య పేట, బొబ్బిలి వరకు పాదయాత్ర కొనసాగనుంది. బొబ్బిలిలో సాయంత్రం జరిగే బహిరంగ సభలో జననేత వైఎస్ జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ మేరకు వైఎస్సార్సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. -
287వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, బొబ్బిలి: రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 287వ రోజు షెడ్యూల్ ఖరారైంది. జననేత చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో అనంతవాహినిలా సాగిపోతోంది. రాజన్న తనయుడు మంగళవారం ఉదయం బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం లక్ష్మీపురం క్రాస్ నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి బాడంగి, ముగద, చిన్న భీమవరం క్రాస్, పెద్ద భీమవరం వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. ముగిసిన పాదయాత్ర: వైఎస్ జగన్ 286వ రోజు పాదయాత్ర లక్ష్మీపురం క్రాస్ వద్ద ముగిసింది. నేడు జననేత పాదయాత్ర ఎస్. బూర్జవలస శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి చౌదంతి వలస మీదుగా బొబ్బిలి నియోజకవర్గంలోని బాడంగి మండలం పిండ్రంగి వలస, డొంకిన వలస, పెద్దపల్లి క్రాస్ మీదుగా లక్ష్మీపురం క్రాస్ వరకు ఈ రోజు పాదయాత్ర కొనసాగింది. నేటి ప్రజాసంకల్పయాత్రలో జననేత 9.5 కిలోమీటర్లు నడిచారు. దీంతో ఇప్పటివరకు మొత్తంగా 3,149.6 కిలోమీటర్ల పాదయాత్రను రాజన్న తనయుడు పూర్తిచేశారు. -
285వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, గజపతి నగరం: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 285వ రోజు షెడ్యూల్ ఖరారైంది. జననేత చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో అనంతవాహినిలా సాగిపోతోంది. ఆదివారం ఉదయం జననేత గజపతి నగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం కోమటిపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి తాడేందొరవలస క్రాస్, కౌండినవలస క్రాస్, మరదం వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది. అక్కడ వైఎస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి సికారుగండి క్రాస్, కె.కొత్తవలస క్రాస్, ఎస్. బుర్జావలస వరకు వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ మేరకు వైఎస్సార్సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. ముగిసిన పాదయాత్ర: వైఎస్ జగన్ 284వ రోజు పాదయాత్ర శనివారం కోమటిపల్లి వద్ద ముగిసింది. నేడు జననేత పాదయాత్ర గజపతినగరం శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి గజపతి నగరం నియోజకవర్గంలోని మధుపాడు, భూదేవీపేట క్రాస్, మరుపల్లి, కొత్తరోడ్డు జంక్షన్, గుడివాడ క్రాస్, మానాపురం, మానాపురం సంత మీదుగా కోమటిపల్లి వరకు ఈ రోజు పాదయాత్ర కొనసాగింది. నేటి ప్రజాసంకల్పయాత్రలో జననేత 10.5 కిలోమీటర్లు నడిచారు. దీంతో ఇప్పటివరకు మొత్తంగా 3,135.5 కిలోమీటర్ల పాదయాత్రను రాజన్న తనయుడు పూర్తిచేశారు. -
బాబును నమ్మి అప్పులపాలయ్యాం
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘అన్నా.. రుణ మాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు మాతో ఓట్లు వేయించుకున్నాడు. అధికారంలోకి వచ్చాక ఆ మాట నిలుపుకోలేదు. పైగా ఇప్పుడేమో అప్పులన్నీ మాఫీ చేశామంటున్నాడు. ఎక్కడ, ఎవరికి మాఫీ చేశారో మాకైతే తెలీదు. ఆయన పుణ్యమా అని కొత్త అప్పులు పుట్టడం లేదు. పాత అప్పు తడిసి మోపెడైంది. సున్నా వడ్డీ రుణాలు ఇవ్వడం లేదు. ఆయన్ను నమ్మి నిండా మునిగాం.. అప్పుల పాలయ్యాం’ అని పలువురు మహిళలు.. ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. ఈసారి మా ఓట్లన్నీ మీకేనని, మిమ్మల్ని సీఎం చేస్తేనే కష్టాలు తీరతాయన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 272వ రోజు గురువారం ఆయన విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలంలోని కొట్యాడ గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. దారిపొడవునా జనం పెద్ద సంఖ్యలో జననేతకు స్వాగతం పలికారు. పిల్లలు, పెద్దలు, మహిళలు, వృద్ధులు, రైతులు, యువతీ యువకులు గుంపులు గుంపులుగా వచ్చి జననేతను కలుసుకున్నారు. తమ గ్రామం గుండా జననేత వెళుతున్నాడని తెలుసుకుని ఆయా గ్రామాల ప్రజలు ఓ పండుగకు సిద్ధమైనట్లుగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ పూట తమ పనులకు స్వస్తి చెప్పి గ్రామాల్లోనే ఉండిపోయారు. జామి మండల కేంద్రంలోని యల్లమాంబ ఆలయానికి ఓ ప్రాశస్త్యం ఉంది. ప్రతి ఏటా మార్చి – ఏప్రిల్ నెలలో అక్కడ యల్లమాంబదేవి తీర్థం జరిగినప్పుడు పెద్ద సంఖ్యలో జనం వచ్చి మొక్కులు తీర్చుకోవడం పరిపాటి. గురువారం జగన్ యాత్రకు కూడా అదే స్థాయిలో జనం వచ్చారని స్థానికులు చెబుతున్నారు. బలహీనవర్గాల వారు అధికంగా ఉండే చుట్టు పక్కల గ్రామాల నుంచి కూడా జగన్‌ను చూడాలని జనం తరలి వచ్చారు. రుణాలు మాఫీ కాలేదన్నా.. డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేస్తానని ఎన్నికలప్పుడు చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక మాట తప్పారని మహిళలు జగన్ ఎదుట వాపోయారు. దీనివల్ల తమకు మునుపటిలా సున్నా వడ్డీకి రుణాలు రావడం లేదని ఫిర్యాదు చేశారు. తమకు అన్ని అర్హతలున్నా పింఛన్లు ఇవ్వడం లేదని పలువురు వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వస్తున్న పింఛన్లను కూడా రద్దు చేశారని వాపోయారు. స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి సుదీర్ఘకాలం పాటు తమకు ప్రాతినిధ్యం వహిస్తున్నా, గ్రామాల్లో మూడు నాలుగు రోజులకు ఒకసారి కూడా మంచినీరు రావడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్‌షాపుల్లో గతంలో చాలా సరుకులు ఇచ్చే వారని, ఇప్పుడు బియ్యం తప్ప ఏమీ లేవంటున్నారని జగన్ దృష్టికి తెచ్చారు. వ్యవసాయ కూలీలకు ఇచ్చే రేట్లు, ఎరువుల ధరలు పెరిగినా, తాము పండించే పంటలకు మాత్రం కనీస మద్దతు ధర లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సాలూరు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర తన నియోజకవర్గంలోని మాజీ సర్పంచ్‌లు, మండల, నియోజకవర్గ స్థాయి నేతలను పార్టీలో చేర్పించారు. వీరంతా ఇప్పటి వరకు కాంగ్రెస్, టీడీపీలో ఉన్నారు. వైఎస్సార్ దయతో ఇల్లు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దయతో పక్కా ఇల్లు నిర్మించుకున్నాను. అంతకు ముందు ఉండడానికి సొంత గూడు లేక అవస్థలు పడ్డాము. కుటుంబమంతా కలిసి పూరింట్లో ఉండేవాళ్లం. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి మా సొంత ఇంటి కలను నెరవేర్చారు. ఇప్పుడు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి మా గ్రామం మీదుగా పాదయాత్రగా వెళ్తుండడంతో ఆయన్ను కలిసి కృతజ్ఞతలు చెప్పాను. – సూరెడ్డి గంగమ్మ, జట్టేటి వలస, జామి మండలం నాకు ఫించను ఆపేశారయ్యా.. అయ్యా.. నాది రామభద్రపు అగ్రహారం. మీ నాన్నగారి హయాంలో నాకు రూ.200 పింఛన్ మంజూరైంది. ఏ ఆధారం లేని నాకు నాలుగేళ్ల క్రితం పింఛన్ ఆపేశారు. భార్య కూడా చనిపోయింది. పదెకరాల భూమి ఉన్న వారికి కూడా పింఛను అందిస్తున్నారు. గ్రామంలో నా లాంటి పేదలకు పింఛన్లు అందించడానికి రాజకీయం చేస్తున్నారు. నాలుగేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా లాభం లేదు. నువ్వు అధికారంలోకి వస్తేనే మళ్లీ నాకు పింఛన్ వస్తుందయ్యా.. – కిర్ల వద్ద జగన్‌తో దువ్వు దేముడు మినీ అంగన్వాడి కార్యకర్త పోస్టు అమ్ముకున్నారు మా ఊరు సోంపురం. మా గ్రామానికి సంబంధించిన మినీ అంగన్వాడి కార్యకర్త పోస్టుకు 20 మంది దరఖాస్తు చేశారు. నా భార్య అప్పల సూర్యనారాయణమ్మ కూడా దరఖాస్తు చేసింది. ఆమె డిగ్రీ చదివింది. రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ అభ్యర్థికి ఇవ్వాల్సిన పోస్టును టీడీపీ నాయకులు బీసీ అభ్యర్థికి కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో డబ్బులు చేతులు మారాయి. అధికారులకు విషయం తెలియజేసినా పట్టించుకోలేదు. – గుర్రం సంతోష్ -
నడక యాతన
పార్వతీపురం రూరల్: మండలంలోని పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు చేసేందుకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మారుమూల గ్రామాలకు సైతం పక్కా రహదారులు నిర్మించామని పాలకులు, అధికారులు గొప్పలు చెప్పుకుంటున్నా నేటికీ రహదారి సౌకర్యాలు లేని గ్రామాలు చాలా ఉన్నాయి. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో స్థానికులు రాకపోకలు సాగించాలంటే గోతులమయమైన రాళ్లు తేలిన రహదారులపైనే ప్రయాణించాల్సి వస్తోంది. గతంలో వేసిన మెటల్ రోడ్లు, మధ్య మధ్యలో గెడ్డలపై నిర్మించిన చిన్న చిన్న కల్వర్టులు శిథిలావస్థకు చేరి ప్రయాణికులకు ఇబ్బందులు కలుగజేస్తున్నాయి. వేసవికాలంలోనే ఇలా ఉంటే వర్షాకాలంలో ఈ రహదారుల మధ్యలో నిర్మించిన వంతెనలపై రాకపోకలు చేయాలంటేనే నరకాన్ని తలపించినట్లవుతుంది. ఈ విధంగా మండలంలోని బుదురువాడ పంచాయతీ బిత్రటొంకి, గోచెక్క పంచాయతీ లిడికివలస, డోకిశీల పంచాయతీ మెల్లికవలస, డెప్పివలస, గంజిగెడ్డ, సరాయివలస, ములగ పంచాయతీ పిండిలోవ, బిల్లగుడ్డివలస గ్రామాలకు నేటికీ పక్కా రహదారులు లేక రాళ్లుతేలిన రహదారులపైనే రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు దృష్టిసారించి ఆయాగ్రామాలకు పక్కా రహదారులు నిర్మించాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. రాకపోకలు చేయలేకపోతున్నాం ప్రతినిత్యం డోకిశీలకు రావాలంటే రాళ్లు తేలిన రహదారిపైనే ప్రయాణించాల్సివస్తుంది. ఏళ్లు గడుస్తున్నా తమ గ్రామానికి రహదారి కష్టాలు తప్పడం లేదు. మెల్లిక ఫిలిప్, గంజిగెడ్డగిరిజనులంటే చులకన ఈ ప్రభుత్వానికి గిరిజనులంటే చులకన భావం. మారుమూల గ్రామాలకు సైతం పక్కా రహదారులు నిర్మిస్తామని చెబుతున్నా హామీలు ప్రకటనలవరకే పరిమితమవుతున్నాయి. కార్యరూపం దాల్చడం లేదు. మెల్లిక రాజు, గంజిగెడ్డ