
సాకి, శ్రీకాకుళం: అలుపెరుగని మోముతో రాష్ట్ర ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 314వ రోజు షెడ్యూల్ ఖరారైంది. రాజన్న తనయుడు చేపట్టిన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత గురువారం ఉదయం రెడ్డిపేట శివారు నుంచి ప్రారంభిస్తారు. అక్కడి నుంచి లోలుగు, నందివాడ క్రాస్ మీదుగా నర్సాపురం ఆగ్రహారంకు చేరుకుంటారు. అనంతరం భోజన విరామం తీసుకుంటారు.
లంచ్ బ్రేక్ అనంతరం మధ్యాహ్నం 02:45కి పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. అక్కడి నుంచి కేశవదాసుపురం క్రాస్, చిలకపాలెం మీదుగా ఎచ్చెర్ల వరకు పాదయాత్ర కొనసాగనుంది. చిలకపాలెంలో సాయంత్రం నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.
ముగిసిన పాదయాత్ర: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 313వ రోజు ముగిసింది. బుధవారం ఉదయం సంతవురిటి శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి దవళపేట, ఆనందపురం ఆగ్రహారం, వాండ్రంగి, పొందూరు, రాపాక జంక్షన్, ఎరుకలపేట క్రాస్, కృష్ణాపురం మీదుగా రెడ్డిపేట వరకు నేటి ప్రజాసంకల్పయాత్ర కొనసాగింది. రాజన్న తనయుడు బుధవారం 9.5 కిలోమీటర్లు నడిచారు. దీంతో జననేత ఇప్పటివరకు 3,390.3 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment