తక్షణమే మిర్చి కొనుగోళ్లు చేపట్టాలి: జగన్
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రభుత్వరంగ సంస్థ అయిన మార్క్‌ఫెడ్ ద్వారా మిర్చి పంటకు మద్దతు ధర ప్రకటించి తక్షణమే కొనుగోళ్లు చేప ట్టాలని వైస్సార్ కాంగెస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మిర్చి ధరలు భారీగా పత నం అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటం దారుణమని వ్యాఖ్యా నించారు.
ఎన్నికల సమయంలో రూ.5000 కోట్ల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని ఎందుకు అమలుచేయరంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయన శుక్రవారం ఉదయం గుంటూరు మిర్చి యార్డులో రైతులతో ముఖాముఖి నిర్వహించి, వారి సాధకబాధకాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులనుద్దేశించి మాట్లాడారు.