సాక్షి, పులివెందుల : దారుణ హత్యకు గురైన తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి భౌతికకాయానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళి అర్పించారు. శుక్రవారం సాయంత్రం పులివెందులలోని వైఎస్ వివేకానందరెడ్డి స్వగృహానికి చేరుకున్న వైఎస్ జగన్ ముందుగా నివాళి అర్పించి, అనంతరం ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా ఉన్నారు. అంతకు ముందు వైఎస్ వివేకానందరెడ్డి భౌతికకాయన్ని సందర్శించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి, వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కన్నీటి పర్యంతమయ్యారు.
చదవండి...(వైఎస్ వివేకానందరెడ్డిది హత్యే!)
Comments
Please login to add a commentAdd a comment