పింఛన్లు కోల్పోయిన వారికోసం పోరాడుదాం: వైఎస్ జగన్ | ys jagan mohan reddy reviews with prakasam district leaders | Sakshi
Sakshi News home page

పింఛన్లు కోల్పోయిన వారికోసం పోరాడుదాం: వైఎస్ జగన్

Published Mon, Nov 24 2014 5:21 PM | Last Updated on Sat, Jul 6 2019 4:04 PM

పింఛన్లు కోల్పోయిన వారికోసం పోరాడుదాం: వైఎస్ జగన్ - Sakshi

పింఛన్లు కోల్పోయిన వారికోసం పోరాడుదాం: వైఎస్ జగన్

ఒంగోలు : పింఛన్లు కోల్పోయిన వారికోసం పోరాటం చేద్దామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం ప్రకాశం జిల్లా పార్టీ సమీక్ష సమావేశాల్లో భాగంగా ఒంగోలులో మాట్లాడారు. అద్దంకి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై వైఎస్ జగన్ సమీక్షించారు.

గత 7 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3700 కోట్ల రూపాయలను పింఛన్ల కోసం ఖర్చు చేయాల్సివుండగా, కేవలం 1338 కోట్లు మాత్రమే కేటాయించిందని వైఎస్ జగన్ చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్లను పెంచామని చెప్పుకుంటూ, మరోవైపు లక్షల సంఖ్యలో కోత వేశారని విమర్శించారు.


ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీకి...టీడీపీకి ఓట్ల తేడా అయిదు లక్షలేనని  వైఎస్ జగన్ అన్నారు. ముఖ్యమంత్రి కావడానికి చంద్రబాబు ఎన్నో అబద్ధాలు చెప్పారని అన్నారు. చంద్రబాబులా అబద్ధాలు చెప్పిఉంటే వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చేందన్నారు.  చంద్రబాబుకు లేనిదీ...మనకు ఉన్నది ...దేవుడి దయ అని వైఎస్ జగన్ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement