
సాక్షి, హైదరాబాద్ : శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో భద్రాద్రిలోను, ఏపీలో ఒంటిమిట్టతో పాటు రెండు రాష్ట్రాల్లోనూ ప్రజలు ఈ పండుగను వైభవంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ శుభాలు కలిగేలా శ్రీసీతారాముల ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నట్లు వైఎస్ జగన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment