
పార్టీ ఎంపీలతో నేడు వైఎస్ జగన్ సమావేశం
సాక్షి, హైదరాబాద్: త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశం శనివారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ కార్యాలయంలో జరగనుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎంపీలు సమావేశం కానున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఇరు రాష్ట్రాల్లో ఎదురవుతున్న సమస్యలు, కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలు తదితర అంశాలను చర్చించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.